ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ 90 రోజులు రద్దు

ABN, Publish Date - Jul 18 , 2025 | 12:59 AM

ట్రాఫిక్‌ చలానాల చెల్లింపునకు 90 రోజుల గడువును రద్దు చేశారు. హెల్మెట్‌ ధారణ, సిగ్నల్‌ జంపింగ్‌, స్టాప్‌లైన్‌ దాటడంపై ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. ఈ జరిమానాల చెల్లింపునకు సంబంధించి పోలీసులు 90 రోజుల గడువు ఇచ్చారు. మూడు నెలల్లోపు జరిమానాలు చెల్లించకపోతే వాహనాలు సీజ్‌ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ గడువును రద్దు చేశారు.

ఇక ట్రాఫిక్‌ చలానా అప్పటికప్పుడు కట్టాల్సిందే..

మూడు నెలల గడువును ఎత్తేసిన పోలీసులు

బకాయిలు భారీగా పేరుకుపోవడంతో నిర్ణయం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ట్రాఫిక్‌ చలానాల చెల్లింపునకు 90 రోజుల గడువును రద్దు చేశారు. హెల్మెట్‌ ధారణ, సిగ్నల్‌ జంపింగ్‌, స్టాప్‌లైన్‌ దాటడంపై ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. ఈ జరిమానాల చెల్లింపునకు సంబంధించి పోలీసులు 90 రోజుల గడువు ఇచ్చారు. మూడు నెలల్లోపు జరిమానాలు చెల్లించకపోతే వాహనాలు సీజ్‌ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ గడువును రద్దు చేశారు. ఇక నుంచి ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించి పోలీసులకు చిక్కితే వెంటనే జరిమానా చెల్లించాల్సిందే.

పేరుకుపోతున్న బకాయిల వల్లే..

ట్రాఫిక్‌ పోలీసులు రెండు విధాలుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్వహిస్తున్నారు. సిగ్నల్‌ జంపింగ్‌లకు ఆర్‌ఎల్‌వీడీ (రెడ్‌లైట్‌ వైలేషన్‌ డిటెక్షన్‌) సీసీ కెమెరాల ద్వారా గుర్తిస్తున్నారు. ఇదికాకుండా ట్రాఫిక్‌ పోలీసులు కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్‌ ధరించకపోయినా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోయినా, బీమా రెన్యువల్‌ కాకపోయినా, రికార్డు లేకపోయినా జరిమానా విధిస్తున్నారు. రోజుకు మొత్తం 1,000 చలానాలను కాంటాక్ట్‌, నాన్‌ కాంటాక్ట్‌ విధానంలో విధిస్తున్నారు. చలానా విధించాక వాహనాలను వదిలిపెట్టడంతో ఉల్లంఘనులు వాటిని చెల్లించడం లేదు. దీంతో చలానాల పెండింగ్‌ జాబితా పెరిగిపోతోంది. ప్రస్తుతం ట్రాఫిక్‌ విభాగంలో 32 వేల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ట్రాఫిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉల్లంఘనులకు జరిమానాల చెల్లింపు విషయంలో మూడు నెలల గడువు అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో 90 రోజుల గడువును ట్రాఫిక్‌ పోలీసులు రద్దు చేశారు.

Updated Date - Jul 18 , 2025 | 12:59 AM