ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తొమ్మిది కేజీల గంజాయి స్వాధీనం

ABN, Publish Date - Jun 12 , 2025 | 12:39 AM

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి 9 కేజీల గంజాయిని పటమట పోలీసులు మంగళవారం రాత్రి పటమటలంక చేపల మార్కెట్‌ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు.

తొమ్మిది కేజీల గంజాయి స్వాధీనం

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

బెంజిసర్కిల్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి 9 కేజీల గంజాయిని పటమట పోలీసులు మంగళవారం రాత్రి పటమటలంక చేపల మార్కెట్‌ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం గుండ్ల వంశీ కుమార్‌ మొబైల్‌ రిపేర్‌ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఇతని స్నేహితుడు గుంచి సాయి తరుణ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతున్నాడు. వీరు గంజాయికి బానిసలయ్యారు. గంజాయి విక్రయిస్తే అధిక నగదు వస్తుందనే ఆశతో మూడు రోజుల క్రితం ఆంధ్ర ఒరిస్సా బోర్డర్‌ వెళ్లి 9 కేజీల గంజాయి కొనుగోలు చేశారు. కేజీ రూ.3 వేల చొప్పున తీసుకున్నారు. వీటిని చిన్నచిన్న ప్యాకెట్లో పెట్టి విక్రయించాలను కున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌, పటమట పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వల్లభనేని పవన్‌ కిషోర్‌ తెలిపారు.

Updated Date - Jun 12 , 2025 | 12:39 AM