ఈ- వ్యర్థాలతో అనేక అనర్థాలు
ABN, Publish Date - Apr 20 , 2025 | 12:02 AM
బెంజిసర్కిల్ లోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఏర్పాటు చేసిన ఈ-వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ(స్పెషల్ డ్రైవ్) కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వీఎంసీ కమిషనర్ సీహెచ్ ధ్యానచంద్ర ప్రజల నుంచి ఎలకా్ట్రనిక్ వ్యర్థాలను సేకరించారు.
ఈ-వేస్ట్ సేకరణను ఉద్యమంగా చేపడదాం
కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపు
బెంజిసర్కిల్, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): ఈ-వే్‌స్ట(ఎలకా్ట్రనిక్ వ్యర్థాల) వల్ల అనేక అనర్థాలు పొంచి ఉన్నాయని భవిష్యత్‌పై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. ఈ-వ్యర్థాల సేకరణను ఉద్యమంగా చేపట్టి వ్యర్థాలను రీసైకిలింగ్ చేయడం ద్వారా విలువైన లోహాల వృథాను అరి కట్టడంతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగస్వాముల వ్వాలని ప్రజలకు వారు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్ర మంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం బెంజిసర్కిల్ లోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఏర్పాటు చేసిన ఈ-వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ(స్పెషల్ డ్రైవ్) కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వీఎంసీ కమిషనర్ సీహెచ్ ధ్యానచంద్ర ప్రజల నుంచి ఎలకా్ట్రనిక్ వ్యర్థాలను సేకరించారు. నగరంలో రోజుకు 700 టన్నుల ఎలకా్ట్రనిక్ వ్యర్థాలను ప్రజలు పారవేస్తున్నారని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. రసాయన పదార్థాలు భూమి, నీరు, గాలిలో కలవడం వల్ల తీవ్ర కాలుష్యమవుతున్నాయని అన్నారు. తద్వారా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి క్యాన్సర్, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వంటి అనే వ్యాధులతోపాటు తల్లిపాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. కాలుష్యరహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దుదా మని, అందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. నగర ప్రాం తాల్లో ఎలకా్ట్రనిక్ వస్తువుల వినియోగం అధికంగా ఉంటుందని, ఈ-వ్యర్థాలను రీసైకిలింగ్ చేయడం ద్వారా సేకరించిన మినరల్స్, కెమికల్స్ నుంచి కోట్లాది రూపాయల ఆదాయం సమకూర్చుకోవచ్చని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఈ-వ్యర్థాల ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా నగర వ్యాప్తంగా అన్ని వార్డుల పరిధిలో ఈవ్యర్థాలను సేకరించే ఏర్పాట్లు చేసినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ సీహెచ్ ధ్యానచంద్ర వివరించారు. అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, కార్పొరేటర్ చెన్నుపాటి క్రాంతిశ్రీ, నగర పాలక సంస్థ జోనల్ కమిషనర్ షమ్మీ, ఇన్‌చార్జి మెడికల్ ఆఫీసర్ గోపాలకృష్ణ నాయక్, స్థానిక నేతలు చెన్నుపాటి గాంధీ, నారా చంద్రబాబు నాయుడు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ-వ్యర్థాల స్పెషల్ డ్రైవ్ ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర జెండా ఊపి ప్రారంభించారు. స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. కాలనీవాసులు అధికారులు, నేతలకు కంప్యూటర్ వ్యర్థాలను అందజేశారు.
Updated Date - Apr 20 , 2025 | 12:02 AM