ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కృష్ణా జలాలను కాపాడుకుందాం

ABN, Publish Date - May 11 , 2025 | 01:17 AM

కృష్ణా జలాలను కాపాడుకుందామని ప్రజల కు జనసేన పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పిలుపుని చ్చారు.

విజయవాడలో కృష్ణా జలయాత్రను ప్రారంభిస్తున్న జనసేన ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను

జనసేన ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పిలుపు

వన్‌టౌన్‌, మే 10(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలను కాపాడుకుందామని ప్రజల కు జనసేన పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పిలుపుని చ్చారు. జనసేన పార్టీ పర్యావరణ విభాగ ప్రధాన కార్యదర్శి, జల బిరాదరి జాతీ య కన్వీనర్‌ బొలిశెట్టి సత్యనారాయణ, అనుమోలు గాంధీ ఆధ్వర్యంలో హంసల దీవి నుంచి మొదలైన కృష్ణా జలయాత్ర శనివారం విజయవాడకు చేరుకుంది. ఇక్కడ కృష్ణ జలయాత్ర కార్యక్రమాన్ని సామినేని ఉదయభాను ప్రారంభించారు. కృష్ణానదిని పారిశ్రామిక కాలుష్యం నుంచి, ఆక్రమణల చెర నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని ఉదయభాను కోరారు. భవిష్యత్‌ తరాలకు కృష్ణానది నుంచి సురక్షితమైన మంచినీటిని అందించటమే లక్ష్యంగా యాత్ర సాగుతుందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో కృష్ణానది సుమారు 1400 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సైన్స్‌, టెక్నాలజీ సీఈవో శరత్‌, జనసేన నాయకులు అజయ్‌ ఠాకూర్‌ వర్మ, ఎస్‌ఎన్‌ మూర్తి, కొండవీటి సంతోష్‌ కృష్ణ, స్టాలిన్‌, గన్ను శంకర్‌, అశోక్‌, తిరుపతి అనూష పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 01:17 AM