కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి
ABN, Publish Date - Apr 17 , 2025 | 01:16 AM
పెనమలూరు నియోజకవర్గంలో షుమారు రూ. 26 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. సాయిపురంలో బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం భవనానికి శంకు స్థాపన చేసి, సీసీ, బీటీ రోడ్లను ప్రారంభించారు.
ఉయ్యూరు, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : పెనమలూరు నియోజకవర్గంలో షుమారు రూ. 26 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. సాయిపురంలో బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం భవనానికి శంకు స్థాపన చేసి, సీసీ, బీటీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, సాయిపురంలో సవంత్సర కాలంలో రూ. 3.65 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఎగినపాడు నుంచి సాయిపురం మీదుగా ముదునూరు వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డు, సాయిపురం మర్రివాడ రోడ్డు అభివృద్ధి జరిగిం దన్నారు. పంచాయతీ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన సీతారామాంజనేయులు అభినందనీయుల న్నారు. సర్పంచ్ జాన్ బాషా, ఎంపీపీ చీలి కల్పన, బోళ్లపాడు ఎంపీ టీసీ గంగారత్నం, ఎంపీడీఓ శేషగిరిరావు, వి సత్యనారా యణ, కుటుంబరావు, జబర్లపూడి సర్పంచ్ శేషవరప్రసాద్ తది తరులు పాల్గొన్నారు. రూ. 4.88 కోట్లతో ఆకునూరు- కడవకొల్లు, నాగన్నగూడెం రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
దశల వారీగా మునిసిపాలిటి అభివృద్ధి
పెనమలూరు : తాడిగడప మునిసిపాలిటీని ఒక క్రమ పద్ధతి లోదశల వారీగా అభివృద్ధి చేయనున్నట్టు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. బుధవారం పోరంకి మహాలక్ష్మీనగర్‌లో రూ. 32లక్షల సాధారణ నిధులతో 3వ, 5వ సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత ప్రభుత్వ ఆర్థిక అరాచకాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్పటికీ రాష్ట్రంలో గుంతల రోడ్లను పూడ్చి అవస రమైన చోట్ల కొత్త రోడ్లు, డ్రైనేజీలనునిర్మించడానికి కూటమి ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోం దని తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులు, గుంతలు పూడ్చే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ తాడిగడప మునిసిపాలిటీ అఽధ్యక్షుడు అనుమో లు ప్రభాకరరావు, కమిషనర్ భవానీ ప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 01:16 AM