ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్‌కు పొలిటీషియన్‌ లక్షణాల్లేవు

ABN, Publish Date - Jun 19 , 2025 | 01:42 AM

వైసీపీ అధినేత జగన్‌కు పొలిటీషియన్‌ లక్షణాలు లేవని, కులాల కుంపట్లు రాజేయటమే ఆయన నైజమని మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

కులాల కుంపట్లు రాజేయడమే ఆయన నైజం: మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

వన్‌టౌన్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌కు పొలిటీషియన్‌ లక్షణాలు లేవని, కులాల కుంపట్లు రాజేయటమే ఆయన నైజమని మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. బుధవా రం మొగల్రాజపురం సిద్ధార్థనగర్‌లోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీస్‌ వ్యవస్థను అందరూ గౌరవిస్తారని, మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌కు ఒక రూల్‌, సాధారణ వ్యక్తులకు మరో రూల్‌ ఉండవని ఆమె స్పష్టంచేశారు. పల్నాడు పర్యటనకు పోలీసుల అనుమతి ఇవ్వకపోతే కోర్టుకెళ్లి అనుమతి తీసుకోవాలి, కానీ బలప్రదర్శన చేసేలా జగన్‌ పర్యటన సాగిందన్నారు.పాదయాత్రలో లోకేశ్‌, పర్యటనల్లో పవన్‌ కల్యాణ్‌ పోలీసులు అనుమతి ఇవ్వకపోతే రూల్‌ ప్రకారమే నడుచుకున్నారని ఆమె తెలిపారు. పల్నాడు పర్యటనలో పోలీసులను అసభ్యకరంగా దూషించటం, రాళ్లు రువ్వటం ఏమిటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా చేయాలని జగన్‌ చూస్తున్నారన్నారు. జగన్‌ను చూసి నేరస్థులు పేట్రేగిపోతారన్నారు. పల్నాడు పర్యటనలో కాన్వాయ్‌ ఢీకొని ఒకరు, తొక్కిసలాటలో మరొకరు గుండెపోటుతో చనిపోయారని వారికి జగన్‌ సంతాపం తెలిపారా..అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్‌లు కట్టి చనిపోయిన వారందరి కుటుంబాలను జగన్‌ పరామర్శించారా అని ఆమె నిలదీశారు. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్‌కు ఇప్పటిదాకా సమయం దొరకలేదా? అని ఆమె ప్రశ్నించారు.

కమ్మ కులంలో పుట్టడమే తప్పా..

జగన్‌..కమ్మ సామాజికవర్గం వారిని వాడుకుని అందరూ ద్వేషించేలా చేస్తాడని వాసిరెడ్డి పద్మ అన్నారు. తనకు జగన్‌ చేసిన ద్రోహం ఎప్పటికీ మరిచిపోనన్నారు. తాను కమ్మకులం లో పుట్టటమే తప్పా అని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఎన్నో అవమానాలకు గురిచేశాడని తెలిపారు. రాష్ట్రంలో గొడవలు చేయాలని జగన్‌ చూస్తున్నాడని రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. పార్టీ నడపటంలో ను, ప్రభుత్వం నడపటంలోనూ జగన్‌కు బాధ్యత లేదని, తాను రాజీనామా చేసిన సమయంలోనే ఈ విషయాలు చెప్పానని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Updated Date - Jun 19 , 2025 | 01:42 AM