ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మైనింగ్‌ మాఫియా ధనదాహం.. నిండుప్రాణం బలి

ABN, Publish Date - Jul 10 , 2025 | 12:38 AM

మైనింగ్‌ మాఫియా ధనదాహానికి నిండుప్రాణం బలైంది. అధికార పార్టీ ముఖ్యనాయకుల కనుసన్నల్లో మండలంలోని రాఘవాపురం కొండను రాత్రివేళల్లో పెకిలిస్తూ నిత్యం 200 లారీల మట్టిని కొల్లగొడుతున్నారు.

మట్టిలో కూరుకున్న ఎక్స్‌కవేటర్‌

అర్ధరాత్రి రాఘవాపురం కొండలో అక్రమ తవ్వకాలు

ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలు

లారీపై మట్టిపడి డ్రైవర్‌ దుర్మరణం

ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌కు సైతం గాయాలు

అధికార పార్టీ వారు కావడంతో పట్టని అధికారులు

నందిగామ, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : మైనింగ్‌ మాఫియా ధనదాహానికి నిండుప్రాణం బలైంది. అధికార పార్టీ ముఖ్యనాయకుల కనుసన్నల్లో మండలంలోని రాఘవాపురం కొండను రాత్రివేళల్లో పెకిలిస్తూ నిత్యం 200 లారీల మట్టిని కొల్లగొడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతుండగా, కొండచరియలు విరిగిపడి టిప్పర్‌పై పడ్డాయి. భారీగా కొండచరియలు పడటంతో టిప్పర్‌తో పాటు ఎక్స్‌కవేటర్‌ మట్టిలో కూరుకుపోయింది. ఒక్కసారిగా అంత మట్టిపడటంతో టిప్పర్‌ పూర్తిగా దెబ్బతింది. డ్రైవర్‌ దాసరి చిన వెంకటేశ్వర్లు (42) గాయాలు కాగా, విజయవాడలోని ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయని తెలుస్తోంది. అతని వివరాలు బయటపడకుండా మాఫియా జాగ్రత్త పడింది. ఘటనాస్థలంలో మట్టిలో కూరుకుపోయిన టిప్పర్‌ను క్రేన్‌ సాయంతో గుట్టుచప్పుడు కాకుండా తీసుకొచ్చి పోలీస్‌స్టేషన్‌ వద్ద పెట్టారు. కాగా, తెరవెనుక ఆ ఘటనను కప్పిపుచ్చే కుట్రలు చేస్తున్నట్టు తెలిసింది.

స్పందించని అధికార యత్రాంగం

రాఘవాపురం గట్టు వద్ద మట్టి అక్రమ రవాణా జరుగుతున్న సంగతి తెలిసినా స్పందించని అధికారులు.. ఓ వ్యక్తి నిండిప్రాణం బలైనా కూడా కనీసం పట్టించుకోలేదు. పోలీస్‌, రెవెన్యూ, మైనింగ్‌ సిబ్బంది ఇటువైపు తిరిగి చూడలేదు. మట్టి అక్రమ తవ్వకాలు జరిపేది అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు కావడం వల్లే ఇలా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఘటన తెల్లవారుజామున జరిగితే మధ్యాహ్నం వరకు పోలీసులెవరూ ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు. ఇదేమిటని ప్రశ్నించగా, పోలీసుల నుంచి విచిత్రమైన సమాధానం వచ్చింది. ఫిర్యాదు అందాకే ఘటనాస్థలిని పరిశీలిస్తామని, మట్టి అక్రమ తవ్వకాలపై తమకు ఎటువంటి సంబంధం లేదని వింతగా సమాధానం చెప్పారు. కాగా, పోలీసుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలూ వస్తున్నాయి. కనీసం రెవెన్యూ యంత్రాంగం కూడా ఇటువైపు చూడకపోవడం గమనార్హం.

అర్ధరాత్రి ఆత్రుతలో..

చేసేది అక్రమ వ్యాపారం కావడం వల్లే అర్ధరాత్రి ఆత్రుతగా ఇలా లోడింగ్‌ చేస్తున్నట్లు తెలిసింది. టిప్పర్‌ను కొండకు ఆనించి పెట్టి, ఎక్స్‌కవేటర్‌తో నేరుగా లోడింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. మట్టిని కిందకు లాగి, లోడింగ్‌ చేస్తే ఆలస్యమవుతుందనే ఇలా చేశారని తెలిసింది.

Updated Date - Jul 10 , 2025 | 12:38 AM