ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మట్టి కొట్టేస్తున్నారు

ABN, Publish Date - Apr 26 , 2025 | 12:50 AM

జిల్లాలో మట్టి మాఫియా దందా కొనసాగుతోంది. అధికార పార్టీ నాయకులుగా ముసుగేసుకున్న కొందరు ప్రతిపక్ష నాయకులతో కలిసి మట్టిని అక్రమంగా తవ్వేసి వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. పంటపొలాలు, డ్రెయినేజీలు, డొంకరోడ్లను సైతం తవ్వేసి, మట్టిని తరలించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా మట్టిని భారీగా తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.

నందివాడ మండలం పెదలింగాలలో డ్రెయినేజీ నుంచి తవ్విన మట్టి తరలింపు

జిల్లావ్యాప్తంగా మట్టి అక్రమ తవ్వకాలు.. విక్రయాలు

అధికార, ప్రతిపక్ష నాయకుల కనుసన్నల్లో రాత్రిపూట తవ్వకాలు

పసుమర్రులో 18 ఎకరాల చెరువును చెరపట్టిన అక్రమార్కులు

ఇదేమని ప్రశ్నిస్తున్న గ్రామస్థులు, రైతులపై దాడులు

మామూళ్ల మత్తులో అటువైపు చూడని అధికారులు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : పామర్రు మండలం పసుమర్రులో 18 ఎకరాల విస్తీర్ణంలో తాగునీటి చెరువు ఉంది. ఈ వేసవిలో ఆ చెరువును ఎండగట్టారు. గ్రామంలోని పాఠశాలను, ఇతరత్రా పల్లపు ప్రాంతాలను మెరకచేసే పేరుతో ఇటీవల ఈ చెరువు నుంచి మట్టి తవ్వకాలను ప్రారంభించారు. భారీగా యంత్రాలను ఏర్పాటుచేసి మట్టిని విజయవాడ, ఉయ్యూరు, పామర్రు తదితర ప్రాంతాలకు తరలించి రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. పసుమర్రు పంచాయతీలో వివిధ ప్రాంతాలను మెరక చేస్తున్నట్టుగా తెరపై చూపి, ఇక్కడ ఆ పనులు చేయకుండా ఇతర ప్రాంతాలకు మట్టిని రాత్రి సమయంలో టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. స్థానికంగా ఎవరైనా మట్టిని కొంటే ట్రాక్టర్‌ రూ.700, పక్కగ్రామంలో రూ.1,200, దూరప్రాంతాలైతే ఒక టిప్పర్‌కు రూ.4 వేల చొప్పున మట్టిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడి మట్టి తవ్వకాలను పర్యవేక్షిస్తున్న మధ్యవర్తులు తమకు ఓ ట్రాక్టరుకు రూ.400 చొప్పున కమీషన్‌ ఇచ్చి, మీ ఇష్టం వచ్చిన ధరకు మట్టిని విక్రయించుకోవాలని ట్రాక్టర్‌, టిప్పర్‌ యజమానులకు భరోసా ఇస్తున్నారు. పసుమర్రు గ్రామానికి చెందిన ఓ కీలక నాయకుడు... ప్రతిపక్ష నాయకుల కనుసన్నల్లో ఈ మట్టి అక్రమ రవాణా కొనసాగిస్తుండటం గమనార్హం. నిమ్మకూరు, జమీగొల్వపల్లిలోనూ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కళ్లెదుటే ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పంచాయతీ, రవాణా, మైనింగ్‌ విభాగం అధికారులు పట్టించుకోవడం లేదు.

మచిలీపట్నం మండలంలో..

మచిలీపట్నం మండలంలోని కరగ్రహారం, చినకరగ్రహారం, బుద్దాలపాలెం, చిన్నాపురం, గుండుపాలెం, బందరు వె స్ట్‌, చినయాదరలో స్థానిక ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో రాత్రి సమయంలో మట్టిని తవ్వి విక్రయిస్తున్నారు. కొన్నిరోజులుగా ఈ వ్యవహారం నడుస్తోంది. చినయాదర గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి చెరువు మట్టిని తవ్వి చుట్టుపక్కల గ్రామాల్లో ఖాళీ స్థలాలను మెరకచేసేందుకు విక్రయిస్తున్నాడు. ఈ విషయంపై గ్రామస్థులు, అధికార పార్టీ నాయకులు అన్ని ఆధారాలతో అఽధికారులకు ఫిర్యాదు చేశారు. తెరవెనుక ఏ జరిగిందో గానీ.. పగటి సమయంలోనూ ఈ చెరువు నుంచి మట్టిని త రలించి విక్రయిస్తున్నారు. కరగ్రహారం, గోపువానిపాలెం తదితర గ్రామాల నుంచి బుసకను తరలిస్తున్న వారి నుంచి ఒక్కో ట్రాక్టరుకు రూ.100 చొప్పున వసూలుచేస్తూ రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పెదపారుపూడి, గుడివాడ మండలాల్లో..

గుడివాడ మండలం వలివర్తిపాడు, బొమ్ములూరు, లింగవరం తదితర ప్రాంతాల్లోని పంటపొలాలను తవ్వేసి మట్టిని విక్రయించే పనులు వారం రోజులుగా ఊపందుకున్నాయి. పెద్దఎత్తున ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. అయినా అధికారులు తమకేమీ తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. నందివాడ మండలం పెదలింగాల ఆత్కూరు డ్రె యిన్‌లో వైసీపీ నాయడొకరు మట్టిని తవ్వి దర్జాగా విక్రయిస్తున్నాడు. అయినా అధికారులు ఆ వైపునకు కన్నెత్తి చూడట్లేదు. ఈ మట్టి అక్రమ రవాణాపై టీడీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం. పెదపారుపూడి మండలం బేతవోలు-పెదపారుపూడి సరిహద్దున ఉన్న డొంకరోడ్డును తవ్వి స్థానిక గ్రామ ప్రజాప్రతినిధి యథేచ్ఛగా మట్టిని విక్రయిస్తున్నాడు. డొంకరోడ్డును తవ్వేస్తే భారీ వర్షాలు కురిసిన సమయంలో వందలాది ఎకరాల పంట పొలాలు ముంపుబారిన పడతాయని పెదపారుపూడికి చెందిన బెనర్జీ అనే రైతు ప్రశ్నించినందుకు సదరు ప్రజాప్రతినిధి అతనిపై దాడి చేయడం గమనార్హం.

Updated Date - Apr 26 , 2025 | 12:50 AM