ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విస్తారంగా..

ABN, Publish Date - May 27 , 2025 | 12:54 AM

బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం, నైరుతి రుతుపవనాల దృష్ట్యా ఉమ్మడి కృష్ణాజిల్లాలో వచ్చే వారం రోజుల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.

నైరుతి ఆగమనాన్ని సూచిస్తూ ప్రకాశం బ్యారేజీ వద్ద నగరాన్ని కమ్మేసిన నల్లటి మబ్బులు

నేటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు

జూన్‌ 2 వరకూ ఇదే పరిస్థితి

ఉమ్మడి కృష్ణాకు ఎల్లో అలెర్ట్‌

వారం రోజుల ఫోర్‌కాస్ట్‌ విడుదల చేసిన వాతావరణ శాఖ

విజయవాడ, మే 26 (ఆంధ్రజ్యోతి) : బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం, నైరుతి రుతుపవనాల దృష్ట్యా ఉమ్మడి కృష్ణాజిల్లాలో వచ్చే వారం రోజుల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు వాతావరణ శాఖ సోమవారం ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం నుంచి వారం పాటు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. చిరుజల్లులతో మొదలై కుంభవృష్టిగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయి. శివారు ప్రాంతాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏటా జూన్‌ 10వ తేదీన తాకే నైరుతి రుతుపవనాలు ఈసారి జూన్‌ 2కు ముందే వస్తున్నాయి. రుతుపవనాలు ఇప్పటికే రాయలసీమను తాకినట్టు వాతావరణ శాఖ చెబుతోంది. కాగా, వాతావరణ శాఖ వారం రోజులకు ఫోర్‌కాస్ట్‌ ప్రకటించగా, జిల్లాలో పది రోజులపాటు వర్ష ప్రభావం ఉంటుందని అంచనా వేశారు.

Updated Date - May 27 , 2025 | 12:54 AM