ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హంసలదీవి బీచ్‌ గేట్లు మూసివేత

ABN, Publish Date - May 24 , 2025 | 01:11 AM

ప్రముఖ పర్యాటక కేంద్రం హంసలదీవి బీచ్‌ గేట్లను అటవీశాఖ అధికారులు ముందస్తు సమాచా రం ఇవ్వకుండా మూసివేయడంపై పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేశా రు.

గేట్లు మూసివేయడంతో నిరాశ చెందుతున్న పర్యాటకులు

ముందస్తు సమాచారం ఇవ్వలేదని పర్యాటకుల ఆగ్రహం

కోడూరు, మే 23(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పర్యాటక కేంద్రం హంసలదీవి బీచ్‌ గేట్లను అటవీశాఖ అధికారులు ముందస్తు సమాచా రం ఇవ్వకుండా మూసివేయడంపై పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. శుక్రవారం కర్నూలు, భద్రాచలం, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి అనేక మంది పర్యాటకులు హంసలదీవి తీరాన్ని సందర్శించేందుకు వచ్చారు. కానీ బీచ్‌ గేట్లు మూసివేయటంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా బీచ్‌ గేట్లు మూసేశారని పాలకాయితిప్ప ప్రజలు చెబుతున్నారని, దీనిపై అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేయకపోవడం ఏంటని వారు ప్రశ్నించారు.

నేటి నుంచి గేట్లు తెరుస్తాం

వాతావరణ మార్పుల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్లు మూసివేశాం. శనివారం నుంచి యథావిధిగా గేట్లు తెరుస్తాం.

- ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ నాగమణి

Updated Date - May 24 , 2025 | 01:11 AM