ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యం కొనుగోలు చేయాలి

ABN, Publish Date - May 06 , 2025 | 12:43 AM

ధాన్యం కొనుగోలు చేసి అకాల వర్షాల నుంచి రైతులను కాపాడాలని నడిం తిరువూరు ప్రాంత రైతులు తహసీల్దార్‌ కె.లక్మికి వినతిప్రతం అందించారు.

తహసీల్దార్‌ లక్ష్మికి వినతిపత్రం అందిస్తున్న నడిం తిరువూరు రైతులు

తిరువూరు, మే 5(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు చేసి అకాల వర్షాల నుంచి రైతులను కాపాడాలని నడిం తిరువూరు ప్రాంత రైతులు తహసీల్దార్‌ కె.లక్మికి వినతిప్రతం అందించారు. సోమవారం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ను రైతులు కలిశారు. పట్టణంలోని ఏఎంసీ కార్యాలయం ఆవరణలో ధాన్యం ఆరబెట్టి రోజులు గడుస్తున్నా, రైతులకు గోనె సంచులు అందించడం లేదని వివరించారు. కాటాలు వేయడం లేదని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని ధాన్యం తడిస్తే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోం దని ఆవేదన వ్యక్తం చేశారు. వావిలాల ప్రాంత రైతులు ఆర్డీవో మాధురికి ధాన్యం కొనుగోలు చేయాలని వినతిపత్రం అందించారు. ఇప్పటికే టార్గెట్‌కు మించి ధాన్యం కొనుగోలు చేశామని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే యోచనలో ఉందని, సంచులు దిగుమతి అవ్వగానే కొనుగోలు చేస్తామని రైతులకు అధికారులు వివరించారు.

గాలివానల నుంచి ధాన్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం

గంపలగూడెం: నెమలిలో రబీలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని రైతులు సోమవారం తహసీల్దార్‌ రాజకుమారికి ఫిర్యాదు చేశారు. ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇబ్బంది పడుతున్నామని వారు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుకు ఇప్పటి వరకు అధికారులు ముందుకు రాలేదని, గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని, గాలివానలకు ధాన్యాన్ని కాపాడుకోలేక అవస్థలు పడుతున్నామని వారు వివరించారు.

Updated Date - May 06 , 2025 | 12:43 AM