ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గోనె సంచులు ఇవ్వండి

ABN, Publish Date - Apr 19 , 2025 | 01:11 AM

ధాన్యాన్ని మిల్లులకు తోలేందుకు గోనెసంచులు ఇవ్వాలంటూ శుక్రవారం రైతులు రాజు గూడెం సొసైటీ వద్ద ఆందోళనకు దిగారు.

రాజుగూడెం సొసైటీవద్ద ఆందోళన చేస్తున్న రైతులు

రోజుల తరబడి కల్లాల్లో ధాన్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం

రాజుగూడెం సొసైటీ వద్ద రైతుల ఆందోళన

(ఆంధ్రజ్యోతి-తిరువూరు): ధాన్యాన్ని మిల్లులకు తోలేందుకు గోనెసంచులు ఇవ్వాలంటూ శుక్రవారం రైతులు రాజు గూడెం సొసైటీ వద్ద ఆందోళనకు దిగారు. మండలంలోని వావిలాల శివారు రాజుగూడెం పీఎసీఎస్‌ పరిధిలోని వావిలాల, ఎర్రమాడు, పెద్దవరం పంచాయతీల్లో మూడువేల ఎకరాల్లో వరి కోతలు పూర్తవడంతో ధాన్యం కల్లాల్లో ఎండబెట్టిన రైతులు ధాన్యం అమ్మేందుకు సంచులకోసం సొసైటీ చుట్టూ తిరుగుతు న్నారు. సిబ్బంది పట్టించుకోకపోవడంతో, కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. సొసైటీకి వస్తున్న సంచులను కొందరు పెద్దలు మధ్యలోనే ఇళ్లకు తరలిస్తున్నారని, ముందుగా ధాన్యం కోసిన వారికి సంచులు అందించకుండా, వరికోతలు చేపట్టని వారికి సొసైటీ నుంచి సంచులు అందిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రోజుల తరబడి కల్లాలో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపా డలేకపోతున్నామని, వర్షం కురిసి తడిసి దెబ్బతింటుందని రైతులు, కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

20 రోజుల నుంచి కల్లాల్లోనే ధాన్యం

వరికోతలు పూర్తిచేసి 20 రోజులయింది. సొసైటీ చుట్టూ సంచులకోసం తిరుగుతున్నాం. గతంలో దిగుమతి చేసిన సంచులు ఎవరికి ఇచ్చారో తెలియదు. సొసైటీకి సంచులు వస్తున్నా సన్న, చిన్నకారు రైతులకు అందడం లేదు.

- కొమ్మినేని కోటేశ్వరరావు, రైతు, రాజుగూడెం

వర్షం వస్తే తీవ్రంగా నష్టపోతాం

సొసైటీకి కావాల్సిన సంచులు అందేలా అధికారులు చూడాలి. కోసిన ధాన్యాన్ని కల్లాల్లో, ఖాళీ స్థలాల్లో ఎండబెట్టాం. అకాలవర్షం వస్తే తీవ్రంగా నష్టపోతాం.

- కొమ్మినేని వీరయ్య, రైతు, రాజుగూడెం

కోతలు పూర్తిచేసిన రైతులకే సంచులు

ఈ క్రాప్‌ బుకింగ్‌ అయ్యి వరి కోతలు పూర్తిచేసిన రైతులకే సంచులు అందిస్తున్నాం. కొందరు రైతులు తమ సొంతవాహనాల్లో మిల్లుల నుంచి సంచులు తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు 25, 600 సంచులు అందించాం. సంచుల కోసం నివేదిక అందించాం, వస్తున్నాయి.

-సూర్యారావు, రాజుగూడెం సొసైటీ సీఈవో

సంచులు సత్వరమే అందిస్తాం: ఆర్డీవో మాధురి

డివిజన్‌ పరిధిలో రైతులకు అవసరమైన గోనె సంచులు సత్వరమే అందిస్తామని ఆర్డీవో మాధురి తెలి పారు. రాజుగూడెం సొసైటీ పరిధిలోని రైతులు ధాన్యం సంచులు అందక పడుతున్న ఇబ్బందుల్ని ఆర్డీవో దృష్టికి ఆర్గానిక్‌ ప్రొడక్ట్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ చైర్మన్‌ శావల దేవతద్‌ తీసుకెళ్లారు. దీంతో ఆర్డీవో స్పందించి సొసైటీకి అవసరమైన సంచులు అందిస్తామని, అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.

Updated Date - Apr 19 , 2025 | 01:11 AM