వైసీపీ నుంచి జనసేనలోకి..
ABN, Publish Date - May 26 , 2025 | 12:33 AM
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడుకు చెందిన వైసీపీ నాయకులు 150 మంది ఆదివారం కరెన్సీనగర్ కాలనీలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ సమక్షంలో పార్టీలో చేరారు.
భారతీనగర్, మే 25(ఆంధ్రజ్యోతి): పెనమలూరు నియోజకవర్గం కంకిపాడుకు చెందిన వైసీపీ నాయకులు 150 మంది ఆదివారం కరెన్సీనగర్ కాలనీలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ సమక్షంలో పార్టీలో చేరారు. బండ్రెడ్డి రామ కృష్ణ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూడాలని వారికి ఆయన సూచించారు. పార్టీలో చేరిన వారిలో చింత కింద సాయి సునీల్, కోటేలు వెకటేశ్వరరావు, తంబాబత్తుల చిన కనక య్య, గుడివాడ హరికృష్ణ, అంబుల రాంబాబు, కూనపరెడ్డి రామకృష్ణ స్నేహితులు, కంకిపాడు ఆటో యూనియన్ అధ్యక్షుడు కోల గోపి, పలువురు ఆటో యూనియన్ నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పులి కామేశ్వరావు, బూరగడ్డ శ్రీకాంత్, జనసేన నేత లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - May 26 , 2025 | 12:34 AM