మొక్కల పెంపకంపై దృష్టి పెట్టండి
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:34 AM
కృష్ణా జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మొక్కలునాటి, వాటిని సంరక్షించేందుకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు.
అధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మొక్కలునాటి, వాటిని సంరక్షించేందుకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వేసవి ముగి సి వర్షాకాలం ప్రారంభం కాగానే జిల్లాలో రహదారి మార్గాలు, విద్యాసంస్థలు, కాలువలు, చెరువుగట్లపై మొక్కలను నాటి వాటిని సంరక్షించేందుకు ప్రణాళికను రూపొందించాలన్నారు. పంచాయతీల్లో తాగునీటి చెరువుల వద్ద మొక్కలను నాటాలని సూచించారు. మొక్కలను సంరక్షించేందుకు పంచాయతీలో ఒకరికి బాధ్యత ను అప్పగించాలని ఆదేశించారు. మూడేళ్లపాటు వీరికి ఉపాధిహామీ పథకం ద్వారా వేతనం చెల్లించేలా చూ డాలన్నారు. గ్రామాల్లో 25సెంట్ల భూమిని గుర్తించి, అక్కడ పల్లెవనాలు అభివృద్ధి చేయాలన్నారు. జిల్లాలో ప్రహరీలు ఉన్న 194 పాఠశాలల ఆవరణల్లో మొక్కలు నాటాలని సూచించారు. దీర్ఘకాలంపాటు పెరిగి నీడను, ఫలసాయం అందించే మొక్కలను నాటేందుకు డ్వామా పీడీకి వివరాలు అందజేయాలన్నారు. అన్ని దేవాలయాల ఆవరణలు, వాటి పక్కనే ఉన్న ఖాళీ స్థలాలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలలు, యూనివర్సిటీలలో అక్కడి భూమి పరిస్థితులకు సరిపడే మొక్కల ను ఎంపిక చేయాలని సూచించారు. మొక్కలు బతికేందుకు నీటిసదుపాయం కోసం బోర్లను వేయించాలన్నా రు. మే 5వతేదీలోగా మొక్కలపెంపకానికి ప్రణాళికను తయారుచేసి నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అటవీశాఖనుంచి మొక్కలను అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో కన్నమనాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్, డీఈవో పీవీజే రామారావు, బీసీ సంక్షే మశాఖ అధికారి రమేష్, డీఎఫ్ వో సునీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 12:34 AM