బిరబిరా కృష్ణమ్మ
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:47 AM
ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణానది ఎరుపెక్కుతోంది. వాగులు, పట్టిసీమ నుంచి వస్తున్న నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది.
ఎగువ నుంచి కృష్ణానదికి వరద
నాలుగు గేట్లు పైకెత్తి దిగువకు విడుదల
విజయవాడ, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణానది ఎరుపెక్కుతోంది. వాగులు, పట్టిసీమ నుంచి వస్తున్న నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. కీసర నుంచి 214, వజినేపల్లి నుంచి 1,595 క్యూసెక్కుల నీరు వస్తోంది. వెలగలేరు ద్వారా పట్టిసీమ నీరు 3,499 క్యూసెక్కులు వస్తోంది. మొత్తం ఎగువ నుంచి 5,308 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో బ్యారేజీ నాలుగు గేట్లను ఒక అడుగు మేర పైకెత్తారు. 3,625 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరో 3,522 క్యూసెక్కులు కాల్వలకు విడుదల చేస్తున్నారు.
Updated Date - Jul 22 , 2025 | 12:47 AM