Vijayawada: గన్నవరం విమానాశ్రయానికి సర్వీసులు రద్దు.. ఏఏ ఫ్లైట్లు రద్దయ్యాయంటే..
ABN, Publish Date - Jan 22 , 2025 | 09:23 AM
విజయవాడ: గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన పలు సర్వీసులు రద్దయ్యాయి. పొగమంచు కారణంగా బెంగళూరు, ఢిల్లీ నుంచి రావాల్సిన విమాన సర్వీసులను యాజమాన్యాలు రద్దు చేశాయి. అలాగే హైదరాబాద్, చెన్నై విమానాలు సైతం ఆలస్యంగా రానున్నాయి.
విజయవాడ: గన్నవరం విమానాశ్రయానికి(Gannavaram Airport) రావాల్సిన పలు సర్వీసులు రద్దయ్యాయి. పొగమంచు కారణంగా బెంగళూరు (Bengaluru), ఢిల్లీ నుంచి రావాల్సిన విమాన సర్వీసులను యాజమాన్యాలు రద్దు చేశాయి. అలాగే హైదరాబాద్ (Hyderabad), చెన్నై (Delhi) విమానాలు సైతం ఆలస్యంగా రానున్నాయి. కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగిపోయింది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే రెండ్రోజులుగా పొగమంచు సైతం వాతావరణాన్ని కమ్మేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ (బుధవారం) పొగమంచు భారీగా ఏర్పడింది. దీంతో పలు విమాన సర్వీసులు రద్దు కాగా.. మరికొన్ని ఆలస్యం కానున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Updated Date - Jan 22 , 2025 | 09:24 AM