దోమలకు ఆవాసాలుగా ఖాళీ స్థలాలు
ABN, Publish Date - May 26 , 2025 | 12:31 AM
మూడో డివిజన్ పరిధిలోని కాలనీల్లో నివాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు దోమలకు ఆవాసం గా మారాయి.
యజమానులు పట్టించుకోకపోవడంతో దట్టంగా పెరిగిన చెట్లు, పిచ్చిమొక్కలు
పల్లంగా ఉండడంతో రోజుల తరబడి బయటకు వెళ్లని వర్షపునీరు
ఇబ్బంది పడుతున్న మూడో డివిజన్ పరిధిలోని కాలనీల ప్రజలు
(ఆంధ్రజ్యోతి-భారతీనగర్)
మూడో డివిజన్ పరిధిలోని కాలనీల్లో నివాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు దోమలకు ఆవాసం గా మారాయి. చాలా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. నాగార్జునగర్ కాలనీ, కరెన్సీనగర్ కాలనీ, శ్రీ రామచంద్రనగర్ కాలనీ, గణేష్‌నగర్, కనకదుర్గానగర్ కాలనీల్లోని ప్రధాన, అంతర్గత రోడ్లలో నివాసాల మధ్య అక్కడక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి. కొంతకాలంగా స్ధల యజమానులు పట్టించుకోకపోవడంతో చెట్లు, పిచ్చిమొక్కలు దట్టంగా పెరిగాయి. కాలనీల్లోని రోడ్ల కంటే స్థలాలు తక్కువ ఎత్తులో ఉండడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీరు, మురుగు చేరి, స్థలాలు చెరువుల్లా కనిపిస్తున్నాయి. పచ్చగడ్డి, పిచ్చిమొక్కలు, చెత్త, వ్యర్థాల కారణంగా దోమలు విజృంభిస్తున్నాయని, అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానిక పెద్దలు కోరుతున్నారు.
Updated Date - May 26 , 2025 | 12:31 AM