విద్యుతశాఖ విజలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
ABN, Publish Date - Jul 17 , 2025 | 12:38 AM
గుణదల డివిజన్ పరిధిలోని ఆటోనగర్ సెక్షన్‌లో బుధవారం విద్యుత శాఖ విజిలెన్స్, ఆపరేషన్ అధికారులు 38 బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 124 కేసులు నమోదు చేసి రూ. 4.08 లక్షల అపరాధ రుసుం విధించారు.
విద్యుతశాఖ విజలెన్స్ అధికారుల
ఆకస్మిక తనిఖీలు
124 కేసులు నమోదు ఫ రూ. 4.08 లక్షల అపరాధ రుసుం
కానూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): గుణదల డివిజన్ పరిధిలోని ఆటోనగర్ సెక్షన్‌లో బుధవారం విద్యుత శాఖ విజిలెన్స్, ఆపరేషన్ అధికారులు 38 బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 124 కేసులు నమోదు చేసి రూ. 4.08 లక్షల అపరాధ రుసుం విధించారు. ఈ దాడులకు ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో డివిజన్‌లోని లైన్‌మెన్‌లు, లైన్ ఇన్‌స్పెక్టర్‌లకు వారి విధులు, బాధ్యతలు, ఫీల్డ్‌లో లైన్‌లు పనిచేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు. ఈదాడుల్లో ఎన్టీఆర్ సర్కిల్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, విజిలెన్స్ ఎస్‌ఈ విజయకృష్ణ, గుణదల డివిజన్ ఈఈ పి. హరిబాబు, విజిలెన్స్ ఈఈ పి. విజయకుమారి, డీఈఈ శివకుమార్, ఆటోనగర్ ఏఈ ఏడుకొండలు, పలువురు విద్యుత శాఖ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 12:38 AM