ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి

ABN, Publish Date - Apr 22 , 2025 | 12:38 AM

ఉప్పకలవగుంట గ్రామానికి చెందిన చిట్టూరి రామకృష్ణ(60) అనుమానాస్పద స్థితిలో నందిగామ సమీపంలోని బొడ్డువానిపాలెం పొలాల్లో మృతి చెంది ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

పెడన, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ఉప్పకలవగుంట గ్రామానికి చెందిన చిట్టూరి రామకృష్ణ(60) అనుమానాస్పద స్థితిలో నందిగామ సమీపంలోని బొడ్డువానిపాలెం పొలాల్లో మృతి చెంది ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. రామకృష్ణ భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జి.సత్యనారాయణ అనుమా నాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణకు మతి స్థిమితం లేదు. అతని భార్య లక్ష్మి పదేళ్ల క్రితం కంకిపా డు సమీపంలోని నెప్పల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆడపిల్లలిద్దరూ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు. ఒంటరిగా ఉన్న రామకృష్ణకు తిండి పెట్టేవారు లేక ఎక్కడ భోజనాలు ఉంటే అక్కడ కడుపు నింపుకొనేవాడు. రామకృష్ణ ఈనెల 18 నుంచి గ్రామంలో కనిపించడం లేదు. సోమవారం తెల్లవారుజామున బొడ్డువానిపాలెంలోని పొలాల్లో శవమై కనిపించాడు.

Updated Date - Apr 22 , 2025 | 12:38 AM