ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డాన్‌బాస్కోలో ముగిసిన డ్రోన్‌ ఫెస్ట్‌

ABN, Publish Date - Apr 10 , 2025 | 12:29 AM

గత రెండ్రోజులుగా డాన్‌బోస్కో స్కూల్లో జరుగుతున్న ఏఐ రోబో డ్రోన్‌ఫెస్ట్‌ బుధవా రంతో ముగిసింది.

నమూనాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌

డాన్‌బాస్కోలో ముగిసిన డ్రోన్‌ ఫెస్ట్‌

పటమట, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): గత రెండ్రోజులుగా డాన్‌బోస్కో స్కూల్లో జరుగుతున్న ఏఐ రోబో డ్రోన్‌ఫెస్ట్‌ బుధవా రంతో ముగిసింది. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన 60 వర్కింగ్‌ మోడల్స్‌ను పరిశీ లించి వాటి పని తీరును అడిగి తెలుసు కున్నారు. ముఖ్యంగా త్రీడి ఫ్రింటింగ్‌, రోబో హాండ్‌, మెడికల్‌ డిస్పెన్షర్‌, అంధులకు కళ్ల జోళ్లు తదితర వివరాలను తెలుసుకున్నారు. వారి సమక్షంలో విద్యార్థులు డ్రోన్‌ తయారు చేసి ఎగుర వేశారు. సుజనా చౌదరి మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ఈవిధమైన ప్రదర్శన ఏర్పాటు చేయడం తానెక్కడా చూడలేదన్నారు. విద్యార్థులను ఈవిధంగా తీర్చిదిద్దిన పాఠశాల యాజమాన్యాన్ని ప్రశంసించారు. మోదీ ఆశయాలకు అనుగుణంగా ఈల్యాబ్‌ను స్టార్టప్‌ ల్యాబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంకేతికను తీర్చిదిద్దడమే కాకుండా విద్యలో నైతిక విలువలు, తల్లిదండ్రుల పట్ల గౌరవభావం తెలుగు భాష పట్ల మమకారం పెంపొందించేందుకు పాఠశాల చేస్తున్న కృషిని అభినందించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఆల్‌ ఇండియా మనాక్‌ ఇన్‌స్పైర్‌ పోటీల్లో ఇన్‌స్పైర్‌ అవార్డు పొందిన లికిత్‌కుమార్‌ అనే విద్యార్థికి ప్రత్యేక బహుమతిని అందించారు.

Updated Date - Apr 10 , 2025 | 12:29 AM