ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మిర్చి సాగుపై అనాసక్తి

ABN, Publish Date - Jun 19 , 2025 | 01:22 AM

ఎన్టీఆర్‌ జిల్లాలో మిర్చి రైతుల పరిస్థితి కడు దయనీయంగా ఉంది. గత సీజన్‌లో దిగుబడి తగ్గడం, మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవటం వల్ల మిర్చి సాగు చేసిన రైతులందరూ అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇంతకు ముందెన్నడూ లేనంతగా తీవ్రంగా నష్టపోయిన రైతులు, కౌలుదారులు మిర్చి సాగుపట్ల ఆసక్తి చూపడం లేదు. ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం సగానికి తగ్గనున్నది.

ఏడాది ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు, కౌలురైతుల మొగ్గు

గత సీజన్‌లో తోటలపై నల్లి దాడి.. తోటలు కకావికలమై తగ్గిన దిగుబడులు..

గిట్టుబాటుధర రాక భారీ నష్టాలు..అప్పుల ఊబిలో సాగుదారులు.. సగానికి పడిపోయిన కౌలు ధరలు

(ఆంధ్రజ్యోతి, కంచికచర్ల):

గత సీజన్‌లో జిల్లాలో 30 వేల ఎకరాల్లో రైతులు మిర్చి తోటలు సాగు చేశారు. పెనుగంచిప్రోలు, వత్సవా యి మండలాల్లో ఎకరం రూ.30 వేల నుంచి రూ.40 వేలకు కౌలుకు తీసుకుని కౌలుదారులు కూడా ఎంతో ఆశతో మిర్చి వేశారు. కౌలు, వ్యవసాయం, ఎరువులు, పురుగుమందులు, నీటి తడులు ఇతరత్రా ఖర్చులు కలిపి ఎకరానికి రూ.1.80 లక్షల నుంచి రెండు లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. కోత, గ్రేడింగ్‌, టిక్కీల తొ క్కుడు, రవాణా కలిపి క్వింటాకు రూ.5 వేల నుంచి రూ. 6 వేల వరకు ఖర్చు అయ్యింది. ఆగస్టు చివర్లో, సెప్టెంబరు మొదట్లో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు మిర్చి తోటలు దెబ్బతిన్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా రైతులు మళ్లీ తోటలు సాగుచేశారు. ఎర్ర నల్లి, నల్ల నల్లి ఉధృతం గా దాడి చేయడంతో రోజుల వ్యవధిలోనే తోటలు కకావికలమయ్యాయి. పూత రాలిపోయింది. ఆకులు, పిందెలు నల్లగా మాడిపోయాయి. చిగుళ్లు సైతం వాడిపోయాయి. మిరప మొక్కలు గిడసబారి, జీవచ్ఛవాల్లా మారాయి. వేరుకుళ్లు సోకినట్టుగా తోటలు ఎర్రబడి నిలువునా ఎండిపోయాయి. ఖరీదైన మందులు పిచికారీ చేసినప్పటికీ నల్లి అదుపులోకి రాలేదు. తోటల్లో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ముదురు తోటల్లో ఎకరానికి 20 క్వింటాళ్ల లోపు, లేత తోటల్లో పది క్వింటాళ్ల లోపు దిగుబడి వచ్చింది.

రైతును చావు దెబ్బ కొట్టిన ధరలు

మార్కెట్‌ ధర కూడా మిర్చి రైతులను చావు దెబ్బకొట్టింది. తేజ రకానికి క్వింటా రూ.ఎనిమిది వేల నుంచి రూ.13 వేల లోపే ధర వచ్చింది. లావు రకాలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల లోపు, మధ్యస్థ రకాలకు రూ.పది వేల నుంచి రూ.11 వేల లోపు ధర వచ్చింది. ఇప్పటికీ మార్కెట్‌ కు దుటపడలేదు. ధరల్లో మార్పు రాలేదు. అంతకు ముందు సీజన్‌లో తాలు (తెల్ల)కాయలకు వచ్చిన ధర కూడా ఇప్పుడు ఎర్రకాయలకు రావటం లేదు. అప్పట్లో తెల్లకాయలకు వచ్చిన రూ.10 వేల నుంచి రూ.13 వేలే ఇప్పుడు ఎర్రకాయలకు పలికింది.

ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టం

మిర్చి సాగు చేసిన రైతుల్లో 90 శాతం మంది నష్టాలను మూటగట్టుకున్నారు. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టం వాటిల్లింది. 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చిన రైతులకు కూడా మిగులు లేకపోగా నష్టపోయారంటే మిర్చి సాగు చేసిన రైతులు ఎం తగా కుదేలయ్యారో అర్ధం చేసుకోవచ్చు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం వల్ల కూడా రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. కొద్దోగొప్పో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సా యం అందుతుందని ఆశించిన రైతులు భంగపడ్డారు. ఇప్పటి వరకు ప్రభుత్వాల నుంచి ఒక్క పైసా కూడా రైతులకు సమకూరలేదు.

మొక్కజొన్న, సుబాబుల్‌, జామాయిల్‌ సాగువైపు మొగ్గు..

కోలుకోలేనంతగా నష్టపోయిన రైతులు, కౌలుదారులు మిర్చి అంటేనే భయపడుతున్నారు. ఆర్థికంగా బాగా చితికిపోయిన కౌలుదారులు అప్పుల్లో కూరుకుపోయారు. దీంతో పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో కౌలు ధరలు సగానికి సగం పడిపోయాయి. మిర్చి తోటలకు కౌలుకు తీసుకునేందుకు కౌలుదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. గత సీజన్‌లో రూ.40 వేలున్న కౌలు ఈ సీజన్‌లో రూ.20వేలకు, రూ.20వేలున్న కౌలు రూ.10 వేలకు పడిపోయింది. ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరు సుబాబుల్‌, జామాయి ల్‌ తోటలు వేస్తున్నారు. ఈ సీజన్‌లో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనున్నది.

Updated Date - Jun 19 , 2025 | 01:22 AM