ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

త్వరగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి

ABN, Publish Date - Apr 17 , 2025 | 01:01 AM

నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరి తగతిన పూర్తి చేయాలని మునిసిపల్‌ కమిష నర్‌ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు.

సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్ర

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరి తగతిన పూర్తి చేయాలని మునిసిపల్‌ కమిష నర్‌ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కమిష నర్‌ చాంబర్‌లోలో బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, జరగాల్సిన పనులపై చర్చిం చారు. ఎస్టేట్‌లన్నీ ఫైర్‌ ప్రూఫ్‌గా ఉండాలని, దానికి ఫైర్‌ఆఫీసర్‌ ఎప్పటికప్పుడు పరిశీలించా లని ఆదేశించారు. అనధికార హోర్డింగులను, కట్టడాలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తుండాలని చీఫ్‌ సిటీ ప్లానర్‌ను ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరిం చాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్‌ కమిషనర్‌ (ప్రాజెక్ట్స్‌) డాక్టర్‌ డి.చంద్రశేఖర్‌, చీఫ్‌ ఇంజనీర్‌ ఆర్‌.శ్రీనాథరెడ్డి, చీఫ్‌ సిటీ ప్లానర్‌ సంజయ్‌ రత్నకుమార్‌, ఇన్‌చార్జి చీఫ్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ గోపాలకృష్ణ నాయక్‌, టీపీటీ (రెవెన్యూ) కమిషనర్‌ జి.సృజన, సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి.సత్యకుమారి, ప్రాజెక్టు ఆఫీసర్‌ పి.వెంకట నారాయణ, డిప్యూటీ డైరెక్టర్‌ (హార్టికల్చర్‌) రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

నిరంతరాయంగా చెత్త సేకరణ జరగాలి...

నగరంలో చెత్త సేకరణ రోజువారి జరగా లని వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్ర శానిటేషన్‌ విభాగం సిబ్బందిని ఆదేశించారు. నగర పర్యట నలో భాగంగా బుధవారం ఆయన ఎంజీ రోడ్డు, ఈ స్ర్టీట్‌, తదితర ప్రాంతాల్లో పర్యటించి పారి శుధ్య నిర్వహణ పరిశీలించారు. 100శాతం చెత్త సేకరణ ఇంటివద్దనే జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన వాహనాలను సమన్వయపరచుకుని ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్యం, ఇంజనీరింగ్‌ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.

అన్న క్యాంటీన్లను పరిశీలించాలి..

నగర పరిధిలో ఉన్న 11 అన్న క్యాంటీన్లను నోడల్‌ ఆఫీసర్లు ప్రతిరోజూ పరిశీలించాలని కమిషనర్‌ ఆదేశించారు. భవానీపురం హెచ్‌బీ కాలనీలోని అన్న క్యాంటీన్‌ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతులలో ఎటువంటి లోపాలు ఉండరాదని అధికారులను ఆదేశించారు.

Updated Date - Apr 17 , 2025 | 01:01 AM