రాజధాని నిర్మాణానికి రండి
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:53 AM
రాజధాని అమరావతి నిర్మాణంలో పట్టభద్రులకు కూడా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం కల్పిస్తోంది. మూడు నుంచి ఆరు నెలల పాటు ఈ ఇంటర్న్‌షిప్‌లు చేసుకునే వీలుంది. వీటిద్వారా పెద్ద ఎత్తున పట్టభద్రులు తగిన అనుభవాన్ని, నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు.
పట్టభద్రులకు ప్రభుత్వ అవకాశం
సీఆర్‌డీఏలో ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
రాజధాని నిర్మాణంలో పాల్గొనవచ్చు
అవగాహన, నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు
గౌరవ భత్యం కూడా పొందవచ్చు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రాజధాని అమరావతి నిర్మాణంలో పట్టభద్రులకు కూడా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం కల్పిస్తోంది. మూడు నుంచి ఆరు నెలల పాటు ఈ ఇంటర్న్‌షిప్‌లు చేసుకునే వీలుంది. వీటిద్వారా పెద్ద ఎత్తున పట్టభద్రులు తగిన అనుభవాన్ని, నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. అమరావతి వంటి అంతర్జాతీయ రాజధాని నిర్మాణ పనుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకోవచ్చు.
మూడు రకాలుగా..
ఈ ఇంటర్న్‌షిప్‌ను సీఆర్‌డీఏ మూడు రకాలుగా కల్పిస్తోంది. గ్రాడ్యుయేట్ ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్స్, యంగ్ ప్రొఫెషనల్స్ కేటగిరీలో చేయొచ్చు. తగిన గౌరవ భత్యాన్ని కూడా అందజేస్తారు. గ్రాడ్యుయేట్ ఇంటర్న్స్‌కు రూ.7,500, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంటర్న్స్‌కు రూ.10 వేలు, యంగ్ ప్రొఫెషనల్స్‌కు రూ.15 వేల చొప్పున ఇస్తారు. ఇంజనీరింగ్ విభాగంలో సివిల్, స్ట్రక్చరల్, జియో టెక్నికల్, హైవే ట్రాన్స్‌పోర్టేషన్, ఎలక్ర్టికల్, పవర్ సిస్టమ్స్, మెకానికల్, ఫైర్ అండ్ సేఫ్టీ, వాటర్ సప్లై, శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ అంశాలు కలిగినవారు ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్లానింగ్ విభాగంలో అర్బన్, రీజనల్, ఇన్ర్ఫాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్టేషన్, ఎన్విరాన్‌మెంట్, ఆర్కిటెక్చర్, ల్యాండ్‌స్కేప్, ఆర్కిటెక్చర్, అర్బన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ వంటి అంశాలు కలిగిన వారిని తీసుకుంటారు. ఎన్విరాన్‌మెంట్ విభాగంలో ఎన్విరాన్‌మెంట్ సైన్స్, ఎకోలజీ, ఎన్విరాన్ మేనేజ్‌మెంట్, క్లైమేట్ సైన్స్, బయో డైవర్శిటీ, రెన్యువబుల్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ ఎకనామిక్స్, మెట్రాలజీ, వేస్ట్ మేనేజ్‌మెంట్ అంశాలకు సంబంధించిన వారిని తీసుకుంటారు. ఎకనామిక్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, ఇన్వెస్ట్‌మెంట్, రిస్క్ మేనేజ్‌మెంట్, స్టాటిస్టిక్స్, కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అంశాలకు సంబంధించిన వారిని ఈ ఇంటర్న్‌షిప్‌నకు తీసుకుంటారు. ఇతర విభాగాలకు సంబంధించి జీఐఎస్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, కాంట్రాక్ట్స్ మేనేజ్‌మెంట్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ వంటి అంశాల్లో తీసుకుంటారు. ఔత్సాహిక విద్యాసంస్థలు కానీ, విద్యార్థులు కానీ నేరుగా సీఆర్‌డీఏకు ఈ-మెయిల్ చేయటం ద్వారా కానీ, ప్రత్యక్షంగా కార్యాలయానికి వచ్చి కానీ దరఖాస్తు చేసుకోవచ్చు.
Updated Date - Apr 18 , 2025 | 12:53 AM