బీసీ యువత ఉన్నతే సీఎం చంద్రబాబు లక్ష్యం
ABN, Publish Date - Apr 26 , 2025 | 01:09 AM
బీసీ యువత ఉన్నతే సీఎం చంద్రబాబునాయుడి లక్ష్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు.
బీసీ స్టడీ స్కరిల్ శిక్షణ కేంద్రం తనిఖీలో మంత్రి సవిత
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): బీసీ యువత ఉన్నతే సీఎం చంద్రబాబునాయుడి లక్ష్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. గొల్లపూడిలోని బీసీ భవన్‌లో బీసీ స్డడీ సర్కిల్ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రాన్ని ఆమె శుక్రవారం తని ఖీ చేశారు. వంట గది అపరిశుభ్రంగా ఉండటంపై మంత్రి ఆగ్రహం వ్య క్తం చేశారు. రాత్రి వంట కోసం టమాటా, ఇతర కూరగాయలు ఉదయ మే కోసి సిద్ధం చేయడం..వాటిపై ఈగలు వాలడం, వాటి పక్కనే వాడుక నీరు ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. పక్కనే పక్వానికి రాని అర టి పండ్లు ఉండటంపై బీసీ వెల్ఫేర్ అధికారులపై మండిపడ్డారు. పక్వానికి రాని అరటిపండ్లు మీరు తింటారా..మీ పిల్లలకు తినిపిస్తారా అని నిలదీశారు. అభ్యర్థుల విశ్రాంతి గదులు, స్నానాలగదులను పరిశీలించారు. గదులు అపరిశుభ్రంగా ఉండటంతో అన్ని గదుల్ని, స్నానాలగదులను శుభ్రం చేయించాలని ఆదేశించారు. మెనూ ప్రకారం అభ్యర్థులకు రుచికరమైన ఆహారం ఎప్పటికప్పుడు తయారు చేసి అందించాలన్నారు. సివిల్ సర్వీసెస్ కోచింగ్ అభ్యర్థులతో కలిసి ఆమె మధ్యాహ్న భోజనం చేశారు. అభ్యర్థులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బీసీ యువతకు ఎంత వరకు మేలు చేయొచ్చో అంత మేలు చేసే కార్యక్రమంలో భాగంగా సివిల్ సర్వీసెస్, డీఎస్సీ వంటి పో టీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కార్పొరేట్‌కు దీటుగా ఉచిత శిక్షణ అందజేస్తున్నామన్నారు.
Updated Date - Apr 26 , 2025 | 01:09 AM