ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సాగు భూములు.. చెరువులుగా..

ABN, Publish Date - Jul 08 , 2025 | 12:48 AM

పచ్చగా కళకళలాడే ప్రభుత్వానికి చెందిన పంట భూములు ఒక్కసారిగా చేపల చెరువులుగా మారిపోయాయి. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన దత్తత ఆలయమైన గూడవల్లి గ్రామంలోని కోదండ రామాలయానికి చెందిన 8 ఎకరాల సాగు భూములను లీజుదారులు చేపల చెరువులుగా మార్చేశారు. అడ్డుకోవాల్సిన అధికారులు అండగా నిలిచి వంత పాడారు. పవిత్రమైన ఆలయ భూములపై అన్యుల ఇష్టానుసార మార్పులపై అధికారులకు ఫిర్యాదులు అందగా, ఆ అవినీతి చేపను పట్టుకునే పనిలో అధికారులు పడ్డారు.

నందివాడ మండలం ఇలపర్రు గ్రామంలో చేపల చెరువులుగా మారిన వ్యవసాయ భూములు ఇవే..

గూడవల్లి కోదండ రామాలయ సాగు భూముల్లో మార్పులు

నందివాడలోని 8 ఎకరాల వ్యవసాయ భూములు చేపల చెరువులుగా..

వ్యవసాయానికి లీజుకు తీసుకుని ఇష్టానుసారంగా..

వేలాది క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకాలు.. విక్రయాలు

దేవదాయ శాఖ కిందిస్థాయి అధికారుల సహకారంతోనే..

చెరువుల తవ్వకాలపై దేవదాయ కమిషనర్‌కు ఫిర్యాదులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ /నందివాడ/వనటౌన) : గూడవల్లి గ్రామంలోని కోదండ రామాలయానికి మొత్తం 24 ఎకరాల భూమి ఉంది. 16వ నెంబర్‌ జాతీయ రహదారి వెంబడి 7, బుడమేరు కట్ట వెంబడి 8 ఎకరాలు ఉన్నాయి. అలాగే, నందివాడ మండలం ఇలపర్రు గ్రామంలో మరో 8 ఎకరాలు ఉన్నాయి. గూడవల్లిలో లోపల వైపు మిగిలిన భూములున్నాయి. వీటిలో నందివాడ మండలం ఇలపర్రు గ్రామంలోని 8 ఎకరాల వ్యవసాయ భూమి చేపల చెరువులుగా మారిపోయింది. ఈ భూములను రెండు చెరువులుగా తవ్వించారు. వ్యవసాయం సాగు కోసమని లీజుకు తీసుకుని చేపల చెరువులుగా మార్చేశారు. చేపల చెరువుల తవ్వకం పేరుతో లీజుకు తీసుకున్న భూమిలోని వేలాది క్యూబిక్‌ మీటర్ల మట్టిని కూడా అమ్మేసుకున్నారు. దేవదాయ శాఖ అనుమతులు లేకుండా, వారికి పైసా చెల్లించకుండా వ్యవసాయ సాగు లీజు పేరుతో అక్రమంగా వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఆ తర్వాత ఏటా చేపల చెరువులుగానే వీటిని లీజుకు ఇస్తున్నారు. దేవదాయ శాఖలోని కిందిస్థాయి అధికారులు.. లీజుదారులతో చేతులు కలిపి ఈ అక్రమానికి పాల్పడినట్టు తెలిసింది. దీంతో ఈ భూములు రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములుగా ఉంటే, దేవదాయ శాఖ లెక్కల్లో చేపల చెరువులుగా చూపిస్తున్నాయి. దేవదాయ భూములను ఇష్టానుసారంగా ప్రైవేట్‌ వ్యక్తులు మార్చుకునే వీల్లేదు. వ్యవసాయం కోసం తీసుకున్న భూములను చేపల చెరువులుగా మార్చే అధికారమూ ఉండదు.

మార్చిందెవరు?

నందివాడలోని 8 ఎకరాలను క్రమం తప్పకుండా లీజుకు ఇస్తున్నారు. లీజులకు తీసుకున్న వారిలో ఎవరు చేపల చెరువు తవ్వారో తెలుసుకోవడం గగనంగా మారింది. కొంతకాలంగా చేపల చెరువుగా కొనసాగుతుండటంతో అసలు ఎప్పటి నుంచి ఈ వ్యవహారం నడిచిందనేది ప్రశ్నార్థకంగా ఉంది. లీజుల ఫైల్‌ను పరిశీలిస్తే.. అసలు సూత్రధారి ఎవరనేది తెలుస్తుంది. వ్యవసాయ లీజులకు తీసుకున్నవారు కాకుండా, మొదటిసారిగా చేపల చెరువు పేరుతో లీజు తీసుకున్నదెవరన్నది తెలుసుకుంటే విషయం బయటపడే అవకాశముంది.

దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు

వ్యవసాయ భూములు చేపల చెరువులుగా మారిపోయిన ఉదంతంపై పలువురు ఆధారాలతో సహా దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చే శారు. ఈ విషయంపై విచారణ జరపాలని కమిషనర్‌ కార్యాలయం నుంచి జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు అందాయి.

Updated Date - Jul 08 , 2025 | 12:48 AM