దక్షిణ భారతదేశంపై కేంద్రం నిర్లక్ష్యం
ABN, Publish Date - May 26 , 2025 | 12:37 AM
దక్షిణ భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూమెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కరణం రాజే్‌షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ రెండో రాజధాని, సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూమెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కరణం రాజే్‌షకుమార్ డిమాండ్
గాంధీనగర్, మే 25(ఆంధ్రజ్యోతి): దక్షిణ భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూమెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కరణం రాజే్‌షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో దేశ రెండో రాజధాని, సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. దక్షిణ భారత జనాభా గణనీయంగా తగ్గిపోయిందని దేశ జనాభాలో 17 శాతం గా ఉందని ఆయన తెలిపారు. దక్షిణ భారతానికి 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. 1970లో డాక్టర్ కేఎల్ రావు ప్రతిపాదించిన నదుల అనుసంధాన ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు ఎటువంటి ప్రగతి లేదన్నారు. గంగా, యమునా నదుల మిగులు జలాలను దక్షిణ భారత దేశంలోని నదులకు అనుసంధానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి దక్షిణ భారత ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. జీఎస్ ఫణిరాజ్‌ను ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య, జైహింద్ పార్టీ అధ్యక్షుడు దశరథరామిరెడ్డి, నవతరం పార్టీ అద్యక్షుడు కనకం శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - May 26 , 2025 | 12:37 AM