ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వేడినీళ్ల కాలువలో యువకుడి మృతదేహం

ABN, Publish Date - May 01 , 2025 | 12:46 AM

బ్రహీంపట్నం వేడినీళ్ల కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు బుధవారం గుర్తించారు.

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం వేడినీళ్ల కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు బుధవారం గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం..మృతుడు సుమారు 5.4 అడుగుల ఎత్తుతో సన్నగా ఉన్నాడని, జుట్టు నలుపుగా ఉందని, సుమారు 20 ఏళ్ల లోపు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. కాఫీ రంగు ఫుల్‌ డ్రాయర్‌, నలుపు రంగు ప్యాంట్‌, రెండు పేటల ఎరుపు రంగు మొలతాడు దేహంపై ఉన్నాయని తెలిపారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి ఎస్సై విజయలక్ష్మి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 01 , 2025 | 12:46 AM