ఆటో బోల్తా..18 మందికి స్వల్ప గాయాలు
ABN, Publish Date - May 15 , 2025 | 12:41 AM
మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారిపై తరకటూరుపాలెం వద్ద బుధవారం ఆటో బోల్తా కొట్టిన సంఘటనలో 18 మందికి స్వల్పగాయాలయ్యాయి.
గూడూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారిపై తరకటూరుపాలెం వద్ద బుధవారం ఆటో బోల్తా కొట్టిన సంఘటనలో 18 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఎస్సై కె.ఎన్.వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లికి చెందిన కొందరు మచిలీపట్నంలో ఓ కార్యక్రమానికి మూడు ఆటోల్లో బయలుదేరారు. గన్నవరం వచ్చేసరికి ఒక ఆటో పాడయిపోవడంతో అందులోని ప్రయాణికులు ప్రమాదం జరిగిన ఆటోలో ఎక్కారు. ఆ ఆటో తరకటూరుపాలెం వద్దకు వచ్చేసరికి హ్యాండిల్‌కు ఆటోలోని ఓ వ్యక్తి కాలు తగలింది. దీంతో హ్యాండిల్ తిరగక ఆటో పక్కకు బోల్తా కొట్టింది. ఆటోలో 9 మంది పెద్దలు, 9 మంది పిల్లలు ఉన్నారు. డ్రైవర్ ఎల్.శివరామప్రసాద్, కోటేశ్వరరావు, వెంకటేశ్వరమ్మ, బ్లెస్సి, శిరీష, చైత న్య, సుజాత, గణేష్, బేబీ, వెంకటేశ్వరరావు, హర్షిత, హనుమంతరావు, రోశమ్మ, హరిచందన, కుమారి, ఆద్య, వంశీ, చైతన్యకు గాయాలయ్యా యి. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - May 15 , 2025 | 12:41 AM