ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అరకొర సౌకర్యాలు.. అందని వైద్యసేవలు

ABN, Publish Date - Apr 17 , 2025 | 01:19 AM

మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సుమారు లక్ష మందికిపైగా జనాభా ఉన్నారు. గన్నవరంలో సామాజిక ఆరోగ్య కేంద్రం, ముస్తాబాదలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 11 గ్రామాలకు పెద్ద అవుటపల్లి, ఆత్కూరు పీహెచ్‌సీ ల నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు.

ముస్తాబాద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం..

ఫ పీహెచ్‌సీల్లో సమస్యల తిష్ఠ

ఫ కేసరపల్లిలో మూతబడిన ఆరోగ్య ఉపకేంద్రం

ఫ గన్నవరం సీహెచ్‌సీలో మందుల కొరత

ఫ చాలిచాలని గదులతో ఇక్కట్లు

ఫ మూతబడిన కొయ్యగూరపాడు ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి

ఫ అసంపూర్తిగా నిలిచిపోయిన ఆత్కూరు పీహెచ్‌సీ నూతన భవన నిర్మాణం

గన్నవరం / ఉంగుటూరు, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సుమారు లక్ష మందికిపైగా జనాభా ఉన్నారు. గన్నవరంలో సామాజిక ఆరోగ్య కేంద్రం, ముస్తాబాదలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 11 గ్రామాలకు పెద్ద అవుటపల్లి, ఆత్కూరు పీహెచ్‌సీ ల నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ముస్తాబాద పీహెచ్‌సీ పరిధిలో మాదలవారిగూడెం, సూరంపల్లి, జక్కుల నెక్కలం, సావరగూడెం, కేసరపల్లి, గన్నవరం, పురుషోత్తపట్నం, కొండ పావులూరు, గోపవరపు గూడెం, ముస్తాబాద గ్రామాలు ఉండ గా 61వేల మంది జనాభా ఉన్నారు. నలుగురు వైద్యులు ఉండాల్సిందిగా ఒకరు డిప్యూటేషన్‌పై సీఎంఓకు వెళ్లారు. హాస్పిటల్‌ భవనం కొత్తగా నిర్మించారు. అయితే ఉన్న జనా భాకు వైద్యులు కొరత ఉంది. కేసరపల్లిలోని ఆరోగ్య ఉప కేంద్రం శిథిలావస్థకు చేరి కూలిపోయింది. దాని గురించి పట్టించుకునే నాధుడే లేరు. గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అవసరమైన కొన్ని మందులు అందు బాటులో ఉండటం లేదు.

ఉంగుటూరు మండలంలో నాలుగు పీహెచసీలు, రెండు ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు వున్నాయి. తేలప్రోలు ప్రభు త్వ ఆయుర్వేద ఆసుపత్రి ఆధునీకరించబడి పూర్తిస్థాయిలో వైద్యసేవలందిస్తుండగా, కొయ్యగూరపాడు ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఏడాదిన్నర కాలంగా మూతపడింది. ఆత్కూరు, ఇందుపల్లి, ఉంగుటూరు, పెదఅవుటపల్లి పీహెచసీల పరిధిలో 24 ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలుండగా గన్నవరం, ఉంగుటూరు మండలాలకు చెందిన 45గ్రామాల ప్రజలు ఆరోగ్యవైద్యసేవలు పొందుతున్నారు. ఫఆత్కూరు పీహెచసీ నూతనభవన నిర్మాణం కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవటంతో అసంపూర్తిగా నిలిచిపోయింది. ఫ పెదఅవుటపల్లి పీహెచసీలో మందు లు స్టాక్‌చేసుకునేందుకు స్టోర్‌రూమ్‌, లేబర్‌రూమ్‌కు అటాచడ్‌ బాతరూమ్‌ లేని కారణంగా పేషెంట్లు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఫ ఇందుపల్లిలో నూతనంగా నిర్మించిన పీహెచసీ భవనం గత ఏడాది మార్చిలో ప్రారంభించారు. త్రీఫేజ్‌ కరెంట్‌ కనెక్షన లేదు. పాతపీహెచసీనే స్టోర్‌రూమ్‌గా వాడుకుంటున్నారు. ఫ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నారా లోకేశ్‌ ఉంగు టూరు నూతన పీహెచసీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 90శాతం పనులు పూర్తవడంతో 2023లో కొత్తపీహెచసీని ప్రారంభించి వైద్యసేవలను అందిస్తున్నారు. చేసిన పనులకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో డూమ్‌సిస్టమ్‌ ఏర్పాటు, ఆపరేషన థియేటర్‌ ప్లాస్టింగ్‌, ఫ్లోరింగ్‌ పనులను కాంట్రాక్టర్‌ నిలుపుదల చేశాడు.

Updated Date - Apr 17 , 2025 | 01:19 AM