ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకోండి
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:35 AM
దీపం-2 పథకం ద్వారా 2025-26 సంవత్సరంలో ఉచితగ్యాస్ సిలిండర్లను పొందేందుకు వినియోగదారులు దరఖాస్తు చేసుకోవాలని జేసీ గీతాంజలిశర్మ బుధవా రం ఒక ప్రకనటలో సూచించారు.
మచిలీపట్నం, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): దీపం-2 పథకం ద్వారా 2025-26 సంవత్సరంలో ఉచితగ్యాస్ సిలిండర్లను పొందేందుకు వినియోగదారులు దరఖాస్తు చేసుకోవాలని జేసీ గీతాంజలిశర్మ బుధవా రం ఒక ప్రకనటలో సూచించారు. ఈ ఏడాది మూడు విడతల్లో వినియోగదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాదికి ఏప్రిల్ నుంచి జూలై వరకు మొద టి సిలిండర్‌ను, ఆగస్టు నుంచి నవంబరు మధ్య రెండో సిలిండర్, డిసెంబరు నుంచి 2026 మార్చి వరకు మూడో సిలిండర్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. గత ఏడాది నవంబరు నుంచి మార్చి వరకు జిల్లాలో 3,60,500 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించామని తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకు 59, 333 సిలిండర్లను ఉచితంగా అందించామని పేర్కొన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 12:35 AM