ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇదేం తీరు?

ABN, Publish Date - Jun 06 , 2025 | 01:00 AM

మల్లవల్లిలో పారిశ్రామికవేత్తల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఇండసి్ట్రయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఐఐసీ) అధికారులు ద్వంద్వ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. వైసీపీ హయాంలో యూనిట్లకు రద్దు చేసిన భూ కేటాయింపులనే పునరుద్ధరిస్తున్నారు. కానీ, గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో భూ కేటాయింపులు పొంది, పనులు చేపడుతున్న సంస్థల విషయంలో మాత్రం ఏపీఐఐసీ అధికారుల తీరు సరిగ్గా లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ టైమ్‌ (ఈవోటీ) ఇవ్వటంపై వివాదాలు రేగుతున్నాయి.

పనులు మొదలుపెట్టని సంస్థల భూ కేటాయింపుల పునరుద్ధరణ

పనులు మొదలుపెట్టిన వారికి సమయం ఇవ్వకుండా నిర్లక్ష్యం

వైసీపీ హయాంలో నానా ఇబ్బందులు పడిన పారిశ్రామికవేత్తలు

పరిహారం ఇవ్వలేదని నాడు దారులు కూడా మూసేసిన రైతులు

ప్రభుత్వం మారడంతో తాజాగా పనుల ప్రారంభించిన సంస్థలు

ఈవోటీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఏపీఐఐసీ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో మల్లవల్లి భూముల వ్యవహారాలు వివాదాస్పదమయ్యాయి. టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం కావటంతో మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్కులో భూ సంబంధిత సమస్యలను నాటి వైసీపీ ప్రభుత్వం పరిష్కరించలేదు. దీంతో తమకు పరిహారం అందలేదన్న పేరుతో రైతులు పనులను జరగనీయలేదు. ఫలితంగా అప్పటికే పనులు మొదలుపెట్టిన పారిశ్రామికవేత్తలు నానా ఇబ్బందులు పడ్డారు. పారిశ్రామికవాడలోకి వెళ్లే దారులను సైతం రైతులు మూసేశారు. పలు రోడ్లకు గండ్లు కొట్టారు. రైతులు చేసిన ప్రయత్నాలను అప్పట్లో పలువురు పారిశ్రామికవేత్తలు అడ్డుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదంటూ అడ్డుగోడలను తొలగించి పనులు చేపట్టే ప్రయత్నం చేశారు. దీంతో పలువురు భూ బాధితులు పారిశ్రామికవేత్తలపై పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టే వరకు వ్యవహారం వెళ్లింది. కొందరు పారిశ్రామికవేత్తలు ఎస్సీ, ఎస్టీల కేసులు కూడా ఎదుర్కొన్నారు. మొదలుపెట్టిన పనులు పూర్తి చేయలేక ఐదేళ్ల పాటు నానా ఇబ్బందులు పడిన పారిశ్రామికవేత్తల విషయంలో ఏపీఐఐసీ అధికారులు మరోలా ప్రవర్తిస్తున్నారు.

ఈవోటీ తాత్సారమెందుకు?

ఉదాహరణకు రత్నం మోటార్స్‌ లిమిటెడ్‌ మల్లవల్లిలో వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్ల తయారీ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. రైతుల అవసరాలు చెబితే, పరిశోధనలు చేసి ఆ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో అధునాతనమైన యంత్రాలను తయారు చేసి ఇస్తుంది. అతి తక్కువ ఖర్చుతో వ్యవసాయ పనిముట్లను సిద్ధం చేస్తుంది. ఈ సంస్థ తాము పొందిన స్థలంలో నాలుగు యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఒకదాని పనులు పూర్తయ్యాయి. రెండు, మూడు, నాలుగు యూనిట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసీ, రైతుల మధ్య నెలకొన్న సమస్య కారణంగా ఐదేళ్ల పాటు ఈ పనులు ముందుకు తీసుకెళ్లలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో ఆ సంస్థ పనులు కూడా ప్రారంభించింది. పనులు ప్రారంభించే సంస్థకు ఏపీఐఐసీ ఈవోటీ ఇవ్వాలి. అలా ఇస్తేనే నిర్ణీత సమయంలోపు ఆ సంస్థ పనిచేయగలదు. ఇలాంటి వాటికి ఈవోటీలు ఇవ్వటం వల్ల ఇప్పటికే మొదలైన పనులను త్వరగా పూర్తిచేస్తాయి. కానీ, అసలు పనులే ప్రారంభించని సంస్థల భూ కేటాయింపులను పునరుద్ధరించి, పనులు చేస్తున్న సంస్థలకు సమయం ఎందుకు ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు. పనులు మొదలుపెట్టిన సంస్థలకు కూడా తగిన అవకాశాలు కల్పిస్తే అవి కూడా త్వరగా ఉత్పాదకతను ప్రారంభిస్తాయి. ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తాయి. కాబట్టి ఈ అంశాలపై ఏపీఐఐసీ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

తప్పు ఎవరిది?

వైసీపీ హయాంలో రైతులతో నెలకొన్న సమస్యలను పరిష్కరించటంలో ఏపీఐఐసీ అఽధికారులు సరిగ్గా వ్యవహరించలేదన్న విమర్శలు ఉన్నాయి. నాడు రైతులు కోర్టులను ఆశ్రయించగా, వారితో సంప్రదింపులు జరిపి సమస్యలను పరిష్కరించుకోమని న్యాయస్థానాలు సూచించినా కూడా అధికారులు అంతులేని నిర్లక్ష్యాన్ని చూపించారు. ఫలితంగా పారిశ్రామికవేత్తలు నానా ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Jun 06 , 2025 | 01:00 AM