YS Sharmila: చంద్రబాబు, మోదీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 08 , 2025 | 11:39 AM
Andhrapradesh: ‘‘చంద్రబాబు గారు.. మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే.. ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది’’ అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోందన్నారు.
విజయవాడ, జనవరి 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు (బుధవారం) విశాఖకు రానున్నారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులకు పీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. దాదాపు రూ.రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు మోదీ. ఏపీకి మోదీ రాక సందర్భంగా ప్రధాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై AP CM Chandrababu Naidu) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila Reddy) పలు విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్, ఉద్యోగాలు, పోలవరం తదిరత అంశాలను ప్రస్తావిస్తూ ఏపీసీసీ చీఫ్ విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు గారు.. మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే.. ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది’’ అని అన్నారు.
విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోందన్నారు. తిరుపతి వేదికగా చంద్రబాబు సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారని గుర్తుచేశారు. కానీ 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని బాబు అడిగారన్నారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే.. చేతలకు దిక్కులేదంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరూ కలిసి ఆటకెక్కించారని మండిపడ్డారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదన్నారు.
PM Modi: విశాఖ పర్యటనకు పీఎం మోదీ.. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టలేదని.. పారిశ్రామిక కారిడార్లు స్థాపన జరగలేదని విమర్శించారు. 10 ఏళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదన్నారు. కడప స్టీల్ కట్టలేదని... విశాఖ ఉక్కును రక్షించలేదని దుయ్యబట్టారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల్లో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా రాష్ట్రానికి ఇచ్చింది లేదన్నారు. విశాఖకు వస్తున్న ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. విశాఖ వేదికగా ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. విభజన హామీలపై క్లారిటీ ఇప్పించాలన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోదీతో పలికించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం
వావ్.. ఇది సాధారణ గుర్రం కాదు.. అసాధారణ ట్యాలెంట్..
Read Latest AP News And Telugu news
Updated Date - Jan 08 , 2025 | 01:08 PM