Chandrababu - Modi Tweet: ఎమ్మెల్సీల విజయంపై మోదీ అభినందనలు.. థాంక్స్ చెప్పిన సీఎం
ABN, Publish Date - Mar 06 , 2025 | 10:54 AM
Chandrababu - Modi Tweet: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విజయం సాధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి, మార్చి 6: ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) కూటమి పార్టీ అభ్యర్థులు విజయదుందుబి మోగించిన విషయం తెలిసిందే. గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. బాబు ట్వీట్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు. అయితే చంద్రబాబు ఇంగ్లీష్‌లో పెట్టిన పోస్టుకు ప్రధాన మోదీ తెలుగులో సమాధానం చెప్పారు.
చంద్రబాబు పోస్ట్..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించినందుకు రాష్ట్ర గ్రాడ్యుయేట్ ఓటర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘‘ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించారు. ఈ ఫలితాలు మన ప్రజానుకూల విధానాలకు, కుటమి ప్రభుత్వంపై పెరుగుతున్న నమ్మకానికి స్పష్టమైన ప్రజాభిప్రాయంగా పనిచేస్తాయి. కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలను అభినందిస్తున్నాను. వారిద్దరికీ నా శుభాకాంక్షలు. మన కార్యకర్తలు, నాయకులు, ఈ ఎన్నికల కోసం అవిశ్రాంతంగా పనిచేసిన ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాన్ని గెలుచుకున్నందుకు గాదె శ్రీనివాసులు నాయుడుని కూడా అభినందిస్తున్నాను’’ అని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Jagan Argument : అయోమయం... జగన్‘వాదం’!
తెలుగులో మోడీ ట్వీట్..
ఈ పోస్టుపై ప్రధాన మోదీ స్పందిస్తూ తెలుగులో ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు మోదీ అభినందనలు తెలియజేశారు. కేంద్రంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డీయే ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయన్నారు. రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
మోదీకి బాబు థాంక్స్
మోదీ పోస్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. ప్రధానికి ధన్యవాదలు తెలియజేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రంలోని ఎన్డీయే పక్షాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ నేతృత్వంలో ఎన్డీఏ అటు దేశంలో ఇటు రాష్ట్రంలో మరెన్నో విజయాలను సాధిస్తుందని నమ్ముతున్నాను. ఎన్డీయే పాలనలో అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాను’’ అంటూ చంద్రబాబు పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి...
Foundation Stone: ఎన్టీఆర్ ట్రస్టు భవన్ శంకుస్థాపన.. భువనేశ్వరి పూజలు..
Read Latest AP News And Telugu News
Updated Date - Mar 06 , 2025 | 10:54 AM