ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GV Reddy: అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు.. సాక్షిలో తప్పుడు వార్తలు

ABN, Publish Date - Jan 29 , 2025 | 12:07 PM

GV Reddy: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై పెట్టిన కేసులో విచారణ అధికారులు వేసిన చార్జిషీట్‌ను కోర్టు రిజెక్ట్ చేసిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి అన్నారు. చార్జిషీట్‌ను కోర్టు రిజెక్ట్‌ చేస్తే జగన్ సొంత పత్రిక సాక్షిలో తప్పుడు వార్తలు రాశారన్నారు. అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించారంటూ సాక్షిలో తప్పుడు వార్తలు రాశారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులందరికీ కూటమి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చిందని తెలిపారు.

AP Fibernet Chairman GV Reddy

విజయవాడ, జనవరి 29: ఏపీ ఫైబర్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డిపై ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి ((AP Fibernet Chairman GV Reddy) మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 2014లో చంద్రబాబు (AP CM Chandrababu Naidu) సీఎంగా తెరాసాఫ్ట్ సంస్థపై ఒత్తిడి తెచ్చారన్న అభియోగాలపై గత ప్రభుత్వం కేసు పెట్టిందని.. తెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్‌పై తప్పుడు కేసులు పెట్టి వేధించారని అన్నారు. కులాల ప్రాతిపదికన చంద్రబాబును ఇరికించేందుకు జగన్ అక్రమ కేసు పెట్టించారని.. చంద్రబాబుపై తప్పుడు ఫిర్యాదులు చేసి ఆయనను అక్రమంగా కేసులో ఇరికించారని మండిపడ్డారు. గతంలో ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేస్తే ఎండీ ఫిర్యాదు ఇచ్చినట్లు ఎఫ్‌ఐఆర్‌లో రాశారన్నారు. ఫిర్యాదులో ఎక్కడా చంద్రబాబు పేరు లేకపోయినా కక్షపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు.


విచారణ మొదలు పెట్టాక చంద్రబాబును ఇరికించాలని ఆయన పేరు పెట్టారని ఆరోపించారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై పెట్టిన కేసులో విచారణ అధికారులు వేసిన చార్జిషీట్‌ను కోర్టు రిజెక్ట్ చేసిందన్నారు. చార్జిషీట్‌ను కోర్టు రిజెక్ట్‌ చేస్తే జగన్ సొంత పత్రిక సాక్షిలో తప్పుడు వార్తలు రాశారన్నారు. అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించారంటూ సాక్షిలో తప్పుడు వార్తలు రాశారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులందరికీ కూటమి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చిందని తెలిపారు. పోస్టింగులు ఇస్తే అధికారులు అనుకూలంగా పనిచేస్తారా.. అలా అయితే గతంలో వైసీపీ పోస్టింగ్‌లు ఇచ్చి అధికారులతో అనుకూలంగా చేయించారనుకోవాలా అని అన్నారు. అధికారులను దిగజార్చేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

ఆ పరువు హత్య నాయనమ్మ కోసమేనా..


చెరుకూరి శ్రీధర్‌ను బెదిరించి లొంగదీసుకున్నారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో అధికారులు చేసిన ఆడిట్ నివేదిక తప్పుడుదని కోర్టు కొట్టేసిందని.. తాము తప్పులు చేశామని ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టినందుకు ఏపీ ఎస్‌ఎఫ్ఎల్ గత ఎండీ మధుసూదన రెడ్డి, గత ఛైర్మన్ గౌతమ్ రెడ్డిపై కేసు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. సాక్షి పత్రిక కథనంపై సీఐడీ అధికారులు బయటకు వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. సీఐడీపై వచ్చిన ఆరోపణలపై ఆ విభాగం అధికారులు స్పందించి వివరణ ఇచ్చి స్పష్టత ఇవ్వాలని అన్నారు. సాక్షిపై పరువు నష్టం కేసు వేసే అంశాన్ని సీఐడీ అధికారులు పరిశీలించాలన్నారు. ఫైబర్ నెట్‌లో వ్యూహం సినిమా ప్రదర్శనకు సంబంధించి అక్రమాలపై దర్శకుడు వర్మకు నోటీసులు ఇచ్చామని... ఆయన నోటీసులు తీసుకున్నారని చెప్పారు. ఫైబర్ నెట్ కేసులో చెల్లించాల్సిన డబ్బు తన వద్ద లేదని వర్మ చెబుతున్నారని ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Tirupati: తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై కేసు నమోదు.

ISRO GSLV-F15: నింగిలోకి దూసుకుపోయిన GSLV F-15 రాకెట్‌.. ప్రయోగం

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 12:19 PM