ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డీఎస్సీ జనరల్‌ అభ్యర్థులకు వయోపరిమితి 47ఏళ్లకు పెంచాలి

ABN, Publish Date - Apr 19 , 2025 | 01:18 AM

త్వరలో ప్రభు త్వం విడుదల చేసే డీఎస్సీ నోటిఫికేషన్‌లో జనరల్‌ అభ్యర్థుల కు వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌ కుమార్‌ ప్రభుత్వానికి శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వానికి ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు హేమంత్‌ కుమార్‌ విజ్ఞప్తి

బెంజిసర్కిల్‌, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): త్వరలో ప్రభు త్వం విడుదల చేసే డీఎస్సీ నోటిఫికేషన్‌లో జనరల్‌ అభ్యర్థుల కు వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌ కుమార్‌ ప్రభుత్వానికి శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వీరి వయోపరిమితి 44 ఏళ్లుగా ఉందని పేర్కొన్నారు. వయస్సు కట్‌ ఆఫ్‌ డేట్‌ను 2024 జూల్‌ 1వ తేదీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో డీఎస్సీ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఎంతోమంది నిరుద్యోగుల వయోపరిమితి పెరిగిందని పేర్కొన్నారు. ఈ కట్‌ ఆఫ్‌ డేట్‌ వల్ల ఎంతో మంది నిరుద్యోగులకు మేలు చేకూరుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో డీఎస్సీ రద్దుకారణంగా అభ్యర్థులు చెల్లించిన పరీక్ష రుసుంను ఈ డీఎస్సీకి చెల్లుబాటు అయ్యేవిధంగా చూడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ ఒకే రోజు నిర్వహించాలని, ఇలా చేయడం వల్ల వివిధ రకాల ప్రశ్నపత్రాలు ఇవ్వా ల్సిన అవసరం ఉండదని సూచించారు. అలాచేయని పక్షంలో కొంతమందికి కష్టమైన, మరికొంతమందికి సులభతరమైన ప్రశ్నపత్రాలు వచ్చి ర్యాంక్‌లో తేడా వచ్చే అవకాశం ఉందని హేమంత్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 01:18 AM