ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కూలిన బతుకులు

ABN, Publish Date - May 06 , 2025 | 12:59 AM

ఓ ఆటోడ్రైవర్‌, మరో కారుడ్రైవర్‌ చేసిన తప్పిదానికి అమాయకులైన ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. తొందరగా వెళ్లాలన్న కంగారులో జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో వెళ్లి ఆటోడ్రైవర్‌ ఆ పేదల ఉసురు తీయగా, వేగంగా వచ్చి ఢీకొని, కనీసం క్షతగాత్రులను ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. రెండు కుటుంబాల్లో విషాదం నింపడంతో పాటు ఏడుగురు గాయపడేలా చేశారు.

ప్రమాదంలో నుజ్జయిన ఆటో

మూలపాడు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం

ఇద్దరు మహిళా కూలీలు మృతి, ఏడుగురికి గాయాలు

రాంగ్‌రూట్‌లో వెళ్తున్న ఆటోను ఢీకొన్న కారు

ప్రమాదం అనంతరం ఆగకుండా వెళ్లిపోయిన కారు

ఇబ్రహీంపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి) : ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామం వద్ద విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం రాంగ్‌రూట్‌లో కేతనకొండవైపు వెళ్తున్న ఆటోను హైదరాబాద్‌ నుంచి విజయవాడ వస్తున్న కారు వేగంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పశ్చిమ ఇబ్రహీంపట్నానికి చెందిన తొమ్మిది మంది కూలీల్లో వేల్పుల మరియమ్మ (45), బూక్యా దుర్గ (40) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు మహిళలు గాయపడ్డారు. రోజువారీ కూలి పనుల్లో భాగంగా సోమవారం ఉదయం కూడా అందరూ ఒకే ఆటోలో మొక్కజొన్నలు ఒలిచే పనికి బయల్దేరారు. మరికొద్దిసేపట్లో పొలంలోకి వెళ్లి ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యేవారు. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న కారు మాత్రం కనిపించలేదు. క్షతగాత్రుల్లో ముడావతు గౌరీ తలకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కన్నెగంటి స్వప్న, వి.మరియమ్మకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. చింత వసంత, షేక్‌ మైలాబీ, వెంకటకుమారి, తుపాకుల దుర్గకు గాయాలయ్యాయి. ఆటోను రాంగ్‌రూట్‌లో నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు కోసం గాలిస్తున్నారు.

పశ్చిమ ఇబ్రహీంపట్నంలో విషాదం

ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోవడం, మరో ఏడుగురికి గాయాలు కావడంతో పశ్చిమ ఇబ్రహీంపట్నంలో విషాదఛాయలు నెలకొన్నాయి. రోజూ కూలి పనులకు వెళ్తే కానీ, పూటగడవని కుటుంబాల్లో కల్లోల్లాన్ని రేపాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని రోదించారు. మరియమ్మ భర్త, దుర్గ భర్త కూలి పనులు చేసుకుంటారు. మరియమ్మకు పిల్లలు లేకపోవడంతో ఒకరిని దత్తత తీసుకుని పెంచుకుంటోంది. దుర్గకు ఇద్దరు పిల్లలు ఉండగా, పెళ్లిళ్లు చేసింది.

Updated Date - May 06 , 2025 | 12:59 AM