అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణికి అరుదైన గిఫ్ట్
ABN, Publish Date - Apr 21 , 2025 | 01:15 AM
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ సతీమణి.. కృష్ణాజిల్లాకు చెందిన ఉషావాన్స్ భారతదేశానికి రానున్నారు. అధికారికంగా పర్యటన ఖరారు కానప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు సమాచారం వచ్చింది. ఉషావాన్స్ ఇండియా వస్తున్న నేపథ్యంలో ఆమెకు అపురూపమైన మెమంటోను బహుమతిగా ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
సాయిపురం సమీప స్టేషన్ మోడల్ మెమంటో బహూకరించాలని రైల్వే శాఖ నిర్ణయం
విజయవాడ రైల్వే డివిజన్ అధికారులకు పరిశీలించాలని ఆదేశాలు
వెంట్రప్రగడ, గుడివాడ, సత్యవాడ, తణుకు స్టేషన్ల వివరాలు అందజేసిన అధికారులు
ఒకదానిని ఎంపిక చేసి.. భారతకు వచ్చాక ఆమెకు బహుకరించనున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ సతీమణి.. కృష్ణాజిల్లాకు చెందిన ఉషావాన్స్ భారతదేశానికి రానున్నారు. అధికారికంగా పర్యటన ఖరారు కానప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు సమాచారం వచ్చింది. ఉషావాన్స్ ఇండియా వస్తున్న నేపథ్యంలో ఆమెకు అపురూపమైన మెమంటోను బహుమతిగా ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఉషావాన్స్ మూలాలు కలిగిన కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామ గుర్తుగా సమీప రైల్వే ేస్టషన్‌కు సంబంధించిన మెమంటోను ఆమెకు బహూకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కేంద్ర రైల్వే శాఖ నుంచి విజయవాడ డివిజన్ అధికారులకు దీనిపై సమాచారం రావడంతో డివిజన్ అధికారులు ఉషావాన్స్ మూలాలు కలిగిన సాయిపురం గ్రామానికి అత్యంత దగ్గరగా ఉన్న వెంట్రప్రగడ, గుడివాడ, సత్యవాడ, తణుకు రైల్వేస్టేషన్లను గుర్తించి వివరాలను కేంద్రానికి పంపించారు. వీటిలో ఒక దానిని కేంద్ర రైల్వే శాఖ ఎంపిక చేసి ేస్టషన్ నమూనాకు సంబంధించిన మెమంటోను ఉషావాన్స్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమెకు బహుకరిస్తారు. అధికారికంగా ఆమె పర్యటన ఖరారైన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉషావాన్స్ మూలాలు కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంతో ముడిపడి ఉన్నప్పటికీ ఇప్పుడు ఎలాంటి జ్ఞాపకాలు ఇక్కడ లేవు. బంధువులు కూడా లేరు. వారి పూర్వీకులకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా లేదు. ఉషావాన్స్ తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మిలు 1970 సంవత్సరం నాటికే అమెరికాకు వలస వెళ్లినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ శాండీయోగోలో ఇంజనీరింగ్, మాలిక్యులర్, బయాలజీ ప్రొఫెసర్లుగా పనిచేశారు. వీరికి ఉష జన్మించారు. ఆ తర్వాత ఉష అమెరికన్ అయిన జేడీ వాన్స్‌ను పెళ్ళాడారు.
Updated Date - Apr 21 , 2025 | 01:15 AM