ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కరెంట్‌ షాక్‌

ABN, Publish Date - Jun 07 , 2025 | 01:13 AM

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పారిశ్రామిక యూనిట్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ‘అదానీ’ సిబ్బంది బలవంతంగా స్మార్ట్‌ మీటర్లు అమర్చడంపై దుమారం రేగుతోంది. ముందుగా తెలియజేయక పోవడమే కాదు.. పరిశ్రమల యాజమాన్యాల అనుమతి కూడా తీసుకోకుండా, సంతకం లేని ఓ నోటీసును అందజేసి బిగించిన ఈ స్మార్ట్‌ మీటర్లకు ఇప్పుడు రూ.లక్షల్లో బిల్లులు బాదుతున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వ హయాంలో విద్యుత శాఖ అధికారులు దొడ్డిదారిన అమలు చేయటంపై పారిశ్రామికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్‌లో గుండెలదిరేలా బిల్లులు రావడంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) రంగాల పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

కానూరు ఆటోనగర్‌లోని పారిశ్రామికవేత్తలకు ఝలక్‌

ముందస్తు సమాచారం లేకుండా అదానీ స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు

సంతకం లేని ఓ నోటీసు అందజేసి హడావిడిగా..

నిన్నటివరకు రూ.8 వేల బిల్లు.. నేడు రూ.లక్ష దాటిపోయి..

స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయటంపై పారిశ్రామికవేత్తల ఆగ్రహం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కానూరు ఆటోనగర్‌లోని పారిశ్రామిక యూనిట్లకు అదానీ సిబ్బంది నెల రోజుల కిందట బలవంతంగా స్మార్ట్‌ మీటర్లను బిగించింది. వీటిని బిగించే ముందు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటుచేసే రోజున ఏపీ సెంట్రల్‌ పవర్‌ డిస్ర్టిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీసీపీడీసీఎల్‌) పేరుతో ఆపరేషన్‌ సెక్షన్‌ నుంచి అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) ఇచ్చినట్టుగా ఒక నోటీసును అందజేశారు. ఆ నోటీసుపై కనీసం ఆపరేషన్‌ సెక్షన్‌కు చెందిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సంతకం కూడా లేదు. కేవలం సర్వీసు నెంబర్‌, కేటగిరీ, సబ్‌ డివిజన్‌ ఖాళీలను పెన్నుతో రాసి మాత్రమే ఇచ్చారు. ఆ నోటీసులో.. మీ సర్వీసు నెంబర్‌ ఫలానా అంటూ ఏపీఈఆర్‌సీ టారిఫ్‌ ఆర్డర్‌ 2019-20, 398 గైడ్‌లైన్స్‌ ప్రకారం లీడ్‌ బ్లాక్‌ను మీటరు నుంచి తొలగించామని, ఇక నుంచి యుటిలిటీ పవర్‌ ఫ్యాక్టర్‌ను మెయిన్‌టైన్‌ చేయాల్సిందిగా పేర్కొన్నారు. అలాగే, లోడ్‌ లేనపుడు కెపాసిటర్‌ను ఆఫ్‌ చేసుకోవాలని, పీఎఫ్‌కు తగినంత (ఎక్కువ, తక్కువ కాకుండా) కెపాసిటర్‌ను కలుపుకోవాలని, అవసరమైతే ఆటోమేటిక్‌ పవర్‌ ఫ్యాక్టర్‌ కంట్రోలర్‌ (ఏపీఎఫ్‌సీ) పెట్టుకోవాలని కూడా నిర్దేశించారు. రోజూ మీటర్‌ కేడబ్ల్యూహెచ్‌, కేవీఏహెచ్‌, పవర్‌ ఫ్యాక్టర్‌ను చెక్‌ చేయాలని, ఇవన్నీ పాటించకపోతే అధిక విద్యుత బిల్లులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే, ఈ నోటీసుపై విద్యుత శాఖ అధికారుల సంతకాలు లేవు. నోటీసులను కూడా విద్యుత శాఖ అధికారులు ఇవ్వలేదు. అదానీ సిబ్బందే ఈ సంతకం లేని నోటీసులను తీసుకురావటం గమనార్హం. విద్యుత శాఖ అధికారులను ప్రశ్నిస్తే తాము నోటీసులు ఇవ్వలేదని చెబుతున్నారు. అలాంటపుడు అదానీ సిబ్బందికి దుందుడుకుతనంగా వ్యవహరించే అధికారం ఎవరిచ్చారని పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు.

రూ.5 వేల నుంచి రూ.1.16 లక్షల వరకు కరెంటు బిల్లు

ఉదాహరణకు కానూరు ఆటోనగర్‌లో సర్వీసు నెంబర్‌ 6521223015058 కలిగిన యూనిట్‌కు మే నెలలో యాజమాన్యం అందుబాటులో లేనపుడు, కేవలం సిబ్బంది ఉన్నప్పుడు అదానీ సిబ్బంది వచ్చి హడావిడి చేశారు. అత్యవసరంగా మీటర్‌ మార్చాలని విద్యుత శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయంటూ స్మార్ట్‌ మీటర్‌ను బిగించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సిబ్బందికి చెప్పలేదు. పోనీలే మీటర్‌ మార్చారని సరిపెట్టుకుంటే, ప్రతినెలా కనిష్టంగా రూ.5 వేల నుంచి గరిష్టంగా రూ.8 వేలు వ చ్చే విద్యుత బిల్లు జూన్‌లో రికార్డు స్థాయిలో రూ.1.16 లక్షలు వచ్చిందని పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు. దీనిపై అదానీ సిబ్బందిని ప్రశ్నించగా, కెపాసిటర్‌ కనెక్టై ఉందని, వెంటనే దానిని మార్చుకోవాలని చెబుతున్నారు. ఈ పనిని అదానీ సిబ్బంది ముందే చేయాలి. అలా చేయకుండా బిల్లు వచ్చిన తర్వాత తీరిగ్గా చెబుతున్నారు. కెపాసిటీర్‌ను తొలగించినా రీడింగ్‌లో తేడా కనిపింట్లేదని ఓ పారిశ్రామికవేత్త గమనించారు. దీంతో మీటరు రీడింగ్‌ను తీస్తుండగా, రోజుకు 20 యూనిట్ల పైనే తిరుగుతోందని ఆయన చెబుతున్నారు. ఈ లెక్కన చూసినా నెలవారీ బిల్లు అసాధారణంగా వచ్చే అవకాశం ఉందనేది ఆయన మాట. ఇలా కానూరు ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌లో యూనిట్లు ఏర్పాటుచేసిన వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. విద్యుత బిల్లులు ఈ స్థాయిలో వస్తే తాము యూనిట్లను నిర్వహించలేమని, తామేం పాపం చే శామో అర్థం కావట్లేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 07 , 2025 | 01:13 AM