ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గంజాయితో దొరికారు

ABN, Publish Date - Jun 26 , 2025 | 12:57 AM

ఒకరు ఓ సాధారణ వ్యాపారి.. మరొకరు వ్యాన్‌ డ్రైవర్‌. తమిళనాడు సాక్షిగా ఇద్దరి స్నేహం కలిసింది. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో జీవిస్తూనే గంజాయి వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లుగప్పి గంజాయిని రాషా్ట్రల సరిహద్దులు దాటించిన వీరు చివరికి నగరంలో పోలీసులకు చిక్కారు.

గంజాయి ప్యాకెట్లను చూపిస్తున్న సీపీ

నగరంలో తమిళనాడుకు చెందిన బ్యాచ్‌ అరెస్టు

ప్రత్యేక వాహనం.. అందులో పెద్దపెద్ద బాక్స్‌లు

వాటిలో గంజాయి.. కనిపించకుండా థర్మాకోల్‌ బాక్స్‌లు

తెలివిగా రవాణా చేస్తున్న ఇద్దరిని పట్టుకున్న ఖాకీలు

రెండు వ్యానుల్లో 200 కిలోల గంజాయి స్వాధీనం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అండి నాగరాజు.. విశాఖపట్నం జిల్లా తగరపువలస ప్రాంతానికి చెందినవాడు. పుట్టి పెరిగిందంతా కోయంబత్తూరు. తర్వాత తగరపువలస వచ్చి తినుబండారాల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అనబలగన్‌ సిన్రసు.. తమిళనాడులోని కక్కి సింగయన్‌ పట్టి గ్రామం. వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏవోబీ సరిహద్దుల నుంచి తీసుకెళ్లిన గంజాయికి కోయంబత్తూరు చుట్టుపక్కల మంచి డిమాండ్‌ ఉందని వీరు గుర్తించారు. సిన్రసు ఏదైనా సరుకును ఉత్తరాంధ్రకు తీసుకొచ్చినప్పుడు నాగరాజును కలుస్తుండేవాడు. తమిళనాడులో గంజాయికి ఉన్న డిమాండ్‌ గురించి తెలుసుకున్నాడు. దీంతో ఉత్తరాంధ్ర చుట్టుపక్కల ఎక్కడెడక్కడ గంజాయి సాగవుతుందో తెలుసుకుని, విక్రయించే ముఠాలతో పరిచయాలు పెంచుకున్నారు. ఏవోబీ సరిహద్దుల నుంచి గంజాయిని కొని తమిళనాడుకు తరలించాలని నిర్ణయించుకున్నారు. తద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించవచ్చని భావించారు.

ఇద్దరిపైనా కేసులు

నాగరాజు, సిన్రసు కొన్నాళ్లుగా ఏవోబీ సరిహద్దుల నుంచి గంజాయిని ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. తర్వాత గంజాయి కోసం ప్రత్యేకంగా ఒక గూడ్స్‌ వ్యాన్‌కు మార్పులు చేర్పులు చేయించారు. ట్రక్‌ అడుగు భాగాన్ని చిన్నచిన్న గదులుగా, గంజాయి ప్యాకెట్లను పెట్టే అరలుగా చేయించారు. గంజాయిని రెండు కిలోల చొప్పున ప్యాకెట్లుగా తయారు చేశారు. వాటిని ఈ అరల్లో అమర్చారు. జాతీయ రహదారిపై కానీ, అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద కానీ పోలీసులు ఆపి తనిఖీ చేసినప్పుడు అనుమానం రాకుండా ఆ అరలపై థర్మాకోల్‌ ఐస్‌బాక్స్‌లను ఏర్పాటు చేశారు. వాటిలో మత్స్యసంపద ఉన్నట్టుగా చూపించేవారు. ఈవిధంగా కొన్నాళ్ల నుంచి గంజాయిని తరలిస్తున్నారు. వీరిద్దరూ లోగడ పోలీసులకు చిక్కిన సందర్భాలు ఉన్నాయి. ఇద్దరి పైనా పాత కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సిన్రసుపై మంగళగిరి పీఎస్‌లో, నాగరాజుపై ఉత్తరాంధ్ర జిల్లాల్లో కేసులు నమోదైనట్టు చెబుతున్నారు. నాగరాజు, సిన్రసు రెండు వేర్వేరు వాహనాల్లో గంజాయిని తరలిస్తూ ఈగల్‌ బృందాలకు విజయవాడలో పట్టుబడ్డారు. సిన్రసు నడుపుతున్న వ్యాన్‌లో 100 కిలోలు, నాగరాజు నడుపుతున్న కారులో మరో 100 కిలోల గంజాయిని గీతానగర్‌ కట్ట సర్వీసు రోడ్డులో నిర్వహించిన తనిఖీల్లో పట్టుకున్నారు. ఏవోబీలో కిలో గంజాయిని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు కొంటున్నారు. దాన్ని తమిళనాడులో రూ.10 వేలకు విక్రయిస్తున్నారని గుర్తించారు. వారిని గురువారం కోర్టులో హాజరుపరుస్తారు. తర్వాత ఈ ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ గంజాయి తరలింపుపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 26 , 2025 | 12:57 AM