215 మంది టీడీపీలో చేరిక
ABN, Publish Date - May 12 , 2025 | 12:46 AM
ప్రతీ కార్యకర్తను నాయకుడిని చేసే బాధ్యత తీసుకుంటానని ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
సత్యనారాయణపురం, మే 11(ఆంధ్రజ్యోతి): ప్రతీ కార్యకర్తను నాయకుడిని చేసే బాధ్యత తీసుకుంటానని ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 27వ డివిజన్‌లో దుర్గాపురం సాంబమూర్తి రోడ్డులోని రజక కల్యాణమండపంలో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు 215మంది బొండా ఉమా సమక్షంలో టీడీపీలో చేరారు. 27వ డివిజన్‌లో టీడీపీకి బలమైన నాయకత్వం ఉందని, డివిజన్‌లోని గులాబితోట వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, రాధా-రంగామిత్రమండలి నాయకులు, అభిమానులు, రజక కమిటీ నాయకులు, కాపు, ఎస్‌సి, బీసీ నాయకులు పెద్దెత్తున పార్టీలో చేరడంతో మిగిలిన రాజకీయపార్టీల దుకాణాలు ఖాళీ అయినట్టేనని ఉమా అన్నారు. టీడీపీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్తలు, నాయకులు క్రమశిణతో పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పని చేయాలని ఆయన సూచించారు. డివిజన్ ఇన్‌చార్జి నవనీతం సాంబశివరావు, అధ్యక్షుడు డి.జయరాజు, ప్రధాన కార్యదర్శి ఎం.సురే్‌షబాబు, కె.ఆర్.కుమార్, కె.బాబు, బి.హనుమంతు, రుక్మిణి పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములు త్యాగం అజరామరం
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం అజరామరమని ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. దుర్గాపురం వాకర్స్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాము జీవితం నేటితరానికి ఆదర్శమని, ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దుర్గాపురం వాకర్స్ క్లబ్ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - May 12 , 2025 | 12:46 AM