Reservoir Updates: కృష్ణమ్మకు మళ్లీ వరద
ABN, Publish Date - Jul 23 , 2025 | 03:57 AM
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా.. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో.. ప్రధాన రిజర్వాయర్లలోకి వరద జలాలు భారీగా వచ్చి చేరుతున్నాయి.
శ్రీశైలంలో ఓ గేటెత్తిన అధికారులు
దిగువకు 27,478 క్యూసెక్కుల విడుదల
విద్యుదుత్పాదనతో మరో 67,185 క్యూసెక్కులు
డ్యాంలో ప్రస్తుత నీటి నిల్వ 208 టీఎంసీలు
నాగార్జునసాగర్‌లో 255 టీఎంసీలు
పులిచింతలలో 19.37 మాత్రమే
భారీగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
నేడు, రేపు భారీ వర్షాలు.. రేపు అల్పపీడనం
నంద్యాల/అమరావతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా.. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో.. ప్రధాన రిజర్వాయర్లలోకి వరద జలాలు భారీగా వచ్చి చేరుతున్నాయి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయాన్ని దరిదాపుగా నింపేసింది. దీంతో ఎస్‌ఈ రామచంద్రమూర్తి.. ఆలయ ఈవో శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం ఒక రేడియల్ క్రస్ట్ గేట్‌ను పదడుగుల మేర ఎత్తి 27,478 క్యూసెక్కులు దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. కుడి, ఎడమ భూగర్భ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పాదనతో 67,185 క్యూసెక్కులను వదిలారు. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలంలోకి 88,623 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నీటి మట్టం మంగళవారం సాయంత్రం 6 గంటలకు 883.70 అడుగులుగా, నీటి లభ్యత 208.28 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ ప్రాంతం సందర్శకులతో నిండిపోయింది.
14 శాతం తక్కువ వర్షపాతం
మరోవైపు.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భజలాలు పడిపోయాయి. వర్షపాతం 14 శాతం (సుమారు 168 టీఎంసీలు) తక్కువగా నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 0.18 శాతం, ఏలూరు- 1.61 శాతం, బాపట్ల-1.34 శాతం, పల్నాడు-4.07 శాతం, ప్రకాశం-4.74 శాతం, నెల్లూరు జిల్లాలో 0.35 శాతం తక్కువగా వానలు కురిశాయి. రాయలసీమ జిల్లాలన్నింటిలోనూ 2.29 శాతం తక్కువగా వర్షపాతం రికార్డయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 110 చిన్న , మధ్య, భారీ జలాశయాల్లో 66.84 శాతం మేర 667.64 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. రాష్ట్రంలోని 38,456 చెరువుల్లో 206.62 టీఎంసీలకు గాను 69.7 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని భారీ జలాశయాల్లో 865.64 టీఎంసీల నీటి నిల్వకు గాను 56 శాతం మేర 610.78 టీఎంసీల నిల్వ ఉంది. ఇంకా 254.86 టీఎంసీల వరద రావలసి ఉంది. మధ్యతరహా ప్రాజెక్టుల్లో 137.08 టీఎంసీలకు గాను 41.28 శాతం (56.58 టీఎంసీలు) అందుబాటులో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు
For More AP News and Telugu News
Updated Date - Jul 23 , 2025 | 09:02 AM