ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సూపర్‌ స్పెషాలిటీ పరీక్షలో కేఎంసీ విద్యార్థుల సత్తా

ABN, Publish Date - Apr 22 , 2025 | 12:04 AM

సూపర్‌స్పెషాలిటీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలో కర్నూలు మెడికల్‌ కాలేజీ వైద్యవిద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

స్టేట్‌ ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ ర్యాంకులు కైవసం

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి):

సూపర్‌స్పెషాలిటీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలో కర్నూలు మెడికల్‌ కాలేజీ వైద్యవిద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ విజయవాడ సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో కర్నూలు మెడికల్‌ కాలేజీ కార్డియాలజీ విభాగానికి చెందిన 2022-24 బ్యాచ వైద్యవిద్యార్థి డా. మహేష్‌ పునుగుపాటి 800 మార్కులకు గాను 567 మార్కులు సాదించి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు, నెఫ్రాలజీ విభాగానికి చెందిన డా. ఆదిత్య, డా. రంగవేణమ్మ ఇద్దరు 800 మార్కులకు 602 మార్కులు ఇద్దరు సాధించి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకును సంయుక్తంగా సాదించారు. యురాలజీ విభాగంలో ఫైనల్‌ ఇంటర్‌ విద్యార్థిని డా.హిమజ 800 మార్కులకుగాను 619 మార్కులు సాధించి స్టేట్‌ సెకండ్‌ ర్యాంకు సాధించింది. ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం నుంచి డా. కిషన రెడ్డి స్టేట్‌ థర్డ్‌ ర్యాంకు సాధించారు. సూపర్‌ స్పెషాలిటీ విభాగంలో కార్డియాలజీ, నెఫ్రాలజీ గ్యాస్ర్టో ఎంట్రాలజీ, యురాలజీ ప్లాస్టిక్‌ సర్జరీ విభాగాల్లో మొత్తం 9మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందరు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందారని ప్రిన్సిపాల్‌ డా.కే. చిట్టినరసమ్మ తెలిపారు.

Updated Date - Apr 22 , 2025 | 12:04 AM