ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సాల్ట్‌ భూములపై కన్ను!

ABN, Publish Date - Jun 04 , 2025 | 01:09 AM

సాల్ట్‌ భూములపై అక్రమార్కులు కన్నేశారు. గుట్టు చప్పుడు కాకుండా 30 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టారు. రైతుల సమాచారంతో స్పందించిన రెవెన్యూ అధికారులను అడ్డుకుని యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

- గుట్టు చప్పుకాకుండా 30 ఎకరాల్లో తవ్వకాలు

- అధికారులకు సమాచారం ఇచ్చిన రైతులు

- అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

బంటుమిల్లి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి):

సాల్ట్‌ భూములపై అక్రమార్కులు కన్నేశారు. గుట్టు చప్పుడు కాకుండా 30 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టారు. రైతుల సమాచారంతో స్పందించిన రెవెన్యూ అధికారులను అడ్డుకుని యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బంటుమిల్లి మండలం కొర్లపాడు పంచాయతీ పెదపాండ్రాక రెవెన్యూ పరిధిలో సుమారు 89 ఎకరాల సాల్ట్‌ భూమి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ భూములపై పెద్దల కన్ను పడింది. దీనిని కబ్జా చేసి చెరువులుగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా గుట్టు చప్పుడు కాకుండా దాదాపు 30 ఎకరాల సాల్ట్‌ భూముల్లో ఎక్స్‌కవేటర్లు దించి పనులు ప్రారంభించారు. స్థానిక రైతులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన బంటుమిల్లి రెవెన్యూ అధికారులు ఎక్స్‌కవేటర్లు స్వాధీనం చేసుకుని పనులు నిలిపివేశారు. సర్వే నెంబరు 147లో ఉన్న ఈ ప్రభుత్వ భూమి 89.91 ఎకరాలు. ఆటుపోట్లు వచ్చిన సమయంలో సముద్రపు నీరు ఈ భూమిలో చేరుతుంది. దీనిని సాగు చేసి ఉప్పు పండించేవారు. కేవలం ఉప్పు తప్ప ఏ ఇతర పంట పండదు. గతంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన బడా వ్యాపారులు చె రువు తవ్వకాలు ప్రారంభించారు. ఆ నాడు ‘ఆంధ్రజ్యోతి’లో వెలువడిన కథనానికి అధికారులు స్పందించి పనులు నిలిపివేశారు. మళ్లీ ఇప్పుడు కొందరు అక్రమార్కులు స్థానికుల సహకారంతో చెరువు తవ్వకాలు చేపట్టారు. దీనిపై సాల్ట్‌శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్‌ నంద కుమార్‌ను వివరణ కోరగా, తవ్వకాల సమాచారం మేరకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. వారు ఎక్స్‌కవేటర్లను స్వాధీనం చేసుకుని పనులు నిలిపివేశారన్నారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.

Updated Date - Jun 04 , 2025 | 01:09 AM