ప్రాజెక్టు కూల్చేసింది మీరే.. విమర్శించేది మీరేనా : చమర్తి
ABN, Publish Date - May 03 , 2025 | 11:30 PM
అన్నమయ్య ప్రాజెక్టు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆనాడు మీ ప్ర భుత్వంలోనే కూల్చింది మీ నే తలే. నేడు విమర్శించేది మీ రేనా అని టీడీపీ పార్లమెం ట్ అధ్యక్షులు చమర్తి జగనమోహనరాజు విమర్శించారు.
రాజంపేట టౌన, మే 3 (ఆంధ్రజ్యోతి) : అన్నమయ్య ప్రాజెక్టు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆనాడు మీ ప్ర భుత్వంలోనే కూల్చింది మీ నే తలే. నేడు విమర్శించేది మీ రేనా అని టీడీపీ పార్లమెం ట్ అధ్యక్షులు చమర్తి జగనమోహనరాజు విమర్శించారు. శనివారం పట్టణంలోని ఆ యన కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ ఎంపీ పెద్దిరెడ్డి మిథునరెడ్డి అన్నమయ్య ప్రాజెక్టుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు ఎలాంటి మెయింటినెన్స చేయకపోవడం వల్ల, ఇసుక తవ్వకాల వల్ల ప్రాజెక్టు గేట్లు ఎత్తకపోవడం వల్ల ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్నారు. ఆనాటి నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టుకు టెండర్లు పిలవకూడదు పిడికిడు మట్టి కూడా వేయని మీరు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అని ఆయన దుయ్యబట్టారు. ఆనాటి ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి ఆ ప్రాంతవాసులకు పక్కా ఇళ్లు కడతామని, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని మాటలు చెప్పి మడమ తప్పిన నేత జగనరెడ్డి కాదా అన్నారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇళ్లు, ఆస్తులు, పొలాలు, జంతుజలం, ఎంతోమంది మృత్యువాత పడ్డారన్నారు. ఆ ప్రాంతంలో ఏ ఒక్కరికి సరైన వసతులు ఇవ్వకపోవడంతో ప్రజలు తోచిన సహాయంతో వారికి తాత్కాలికంగా గృహాలు ఏర్పాటు చేశారని, ఇప్పటికీ వాటిల్లోనే ఉన్నారన్నారు. ఇన్నిరోజులు మీ ప్రభుత్వం ఉన్నా ఏమీ చేయకపోవగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం పనులు మా ప్రభుత్వంలోనే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. టీడీపీ నేతలు గన్నే సుబ్బనరసయ్య, కొల్లు రెడ్డయ్య, మదనపల్లె శ్రీను, ప్రవీణ్, శివనారాయణ, సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 03 , 2025 | 11:30 PM