ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఒత్తిడి ని జయించే సాధనం యోగా

ABN, Publish Date - Jun 19 , 2025 | 11:54 PM

ప్రతిరోజు యోగాను ఆచరించడం వలన ఆరోగ్య పరిరక్షణతోపాటు ఒత్తిడిని జయించే సాధనంలా పనిచేస్తుందని కామనూరు పీహె చ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ హనీఫ్‌బాబా పేర్కొన్నారు.

కాకిరేణిపల్లెలో యోగాపై అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది

ప్రొద్దుటూరు రూరల్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ప్రతిరోజు యోగాను ఆచరించడం వలన ఆరోగ్య పరిరక్షణతోపాటు ఒత్తిడిని జయించే సాధనంలా పనిచేస్తుందని కామనూరు పీహె చ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ హనీఫ్‌బాబా పేర్కొన్నారు. గురువారం చౌడూరు సచివాలయ పరిధిలోని కాకిరేణిపల్లె గ్రామంలో యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు చేసే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ బీఏ వరప్రసాద్‌, ఆప్తాల్మిక్‌ ఆఫీసర్‌ తేజ, సీహెచ్‌వో గౌతమి, ఏఎన్‌ఎంలు గోవిందమ్మ, వేదవతి, ఆశా కార్యకర్తలు వెంకటసుబ్బమ్మ, పద్మావతి, సంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

జమ్మలమడుగులో: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జమ్మలమడుగు నారాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ అధికారి మోహన్‌, పండితులు తెలిపారు. గురువారం జమ్మలమడుగు నారాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాసనాలు ప్రతి వాడ, ప్రతి ఇంటికి స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు చేయాలని సూచించారు. అందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో తామంతా మరికొందరు భక్తులతో ప్రతి రోజు ఉదయం యోగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రారంభించామన్నారు. ఆలయాల సమీపంలో ఉన్న భక్తులు, అధికారులు యోగాసనాలు చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

పోరుమామిళ్లలో : యోగాపై స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఆ కళాశాలలో మైదుకూరు ప్రభుత్వ డిగ్రీకళళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన డాక్టర్‌ మర్రి శ్రీనివాసు లు హాజరై యోగా ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సి పాల్‌ రామిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే పుల్లీడు గ్రామంలో కూడా అధికారు లు యోగా కార్యక్రమంపై అవగాహన కల్పించారు.

Updated Date - Jun 19 , 2025 | 11:54 PM