ఇలా ఉంటే వ్యాధులు ప్రబలవా?
ABN, Publish Date - Jun 28 , 2025 | 11:37 PM
మురుగునీరు చెత్తకుప్పలు ఉంటే వ్యాధులు ప్రబలవా? అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మైదుకూరు రూరల్, జూన్ 28(ఆంధ్రజ్యోతి) : మురుగునీరు చెత్తకుప్పలు ఉంటే వ్యాధులు ప్రబలవా? అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు సీజనల్ వ్యాధులు సోకకుండా పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలంటూ అధికారులు పేర్కొంటున్నా అవి ఆచరణలో కొన్నిచోట్ల ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. నియోజకవర్గ కేంద్రమైన మైదుకూరు పట్టణంలో కొన్ని చోట్ల రోడ్డుపక్రనే చెత్తకుప్పలు పేరుకుపోయి వాటిలో పందులు తిరుగుతున్నా పట్టించుకునేవారు లేరు. ప్రస్తుతం వర్షాకా లం రావడంతో సీజనల్ వ్యాధులు ఇప్పుడిప్పుడే విజృభిస్తున్నాయి. మురుగు కాలువల్లో పూడికతీయకపోవడం, వీధుల్లో చెత్త చెదారాలు పే రుకుపోవడం తో దోమలు వ్యాప్తిచెంది రోగాలు విజృంభిస్తాయన్నారు. వ్యాధులు రాకమును పే అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మురుగునీటితో ఇబ్బందులు
దువ్వూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): దువ్వూరు మండలం నీలాపురంగ్రామంలో మురుగునీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ నడిబొడ్డున జనసంచారం కలిగిన ప్రదేశంలో ఉన్న మురుగునీటి కాలువలో మురుగు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. కనీసం కాలువపైనే ఇనుప గరండాలు లేక సిమెంటు దిమ్మెలతో మూతవేస్తే కొంతలో కొతైనా సమస్యలు ఉండవని పలువురు పేర్కొంటున్నారు. నిత్యం జనరద్దీ ఉన్నచోటే మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సీజనల్ వ్యాధులు ప్రబలక ముందే తగు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - Jun 28 , 2025 | 11:37 PM