ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడో..?

ABN, Publish Date - Jul 06 , 2025 | 11:55 PM

మండలంలోని ఎస్‌.వెంకట్రామా పురం పంచాయతీ పరిధిలోని ముద్దంవారిపల్లెలో బ్రిడ్జి నిర్మాణం పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముద్దంవారిపల్లెలో అసంపూర్తిగా బ్రిడ్జి నిర్మాణం

వర్షాకాలంలో యల్లవపల్లెవాగుతో ముద్దంవారిపల్లె వాసులకు తప్పనికష్టాలు గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఆగిన బ్రిడ్జి పనులు

పోరుమామిళ్ల, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఎస్‌.వెంకట్రామా పురం పంచాయతీ పరిధిలోని ముద్దంవారిపల్లెలో బ్రిడ్జి నిర్మాణం పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో యల్లవపల్లెవాగు ఉప్పొంగినపుడు ముద్దంవారిపల్లె రోడ్డుపై నీరు ప్రవహించి ఆయాగ్రామా లకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముద్దంవారిపల్లెలో సుమారు కోటి రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం చేప ట్టారు. దాదాపు రెండేళ్లు పైబడి కావస్తున్నా బిల్లులు అందకపోవడంతో సంబంధిత కాంట్రా క్లర్లు ఆ పనులను అర్ధాంతరంగా నిలిపి వేయా ల్సి వచ్చింది. దీంతో గ్రామస్థులు గ్రామం నుం చి ప్రధాన రహదారికి రావాలన్నా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 60 కుటుబాల కు పైగా ముద్దం వారిపల్లెలో నివాసం ఉంటున్నారు. గ్రామం నుంచి 30 మంది విద్యార్థులు విద్యాభ్యాసం కోసం ప్రధాన రహదారికి రావాలంటే ఒకటిన్నర కిలోమీటరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వర్షం వస్తే ఆ గ్రామానికి బస్సులు, ఆటోలు కూడా వెళ్లలేని పరిస్థితి. అంతేకాక ఈ గ్రామానికి సమీపంలో యల్లవపల్లె వాగు ఈ ప్రాంతం గుండా వెళుతుందని అలాంటి సమయంలో తమ గ్రామానికి రావాలన్నా నీటిలోనే ప్రయాణం చేయాల్సి ఉంటుందని గ్రామస్థులు వాపో తున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా గ్రామంలోనేఉండాల్సిన పరిస్థితి వారిది. ఇప్పటికే గ్రామస్థులు కొందరు కూటమి నేతల దృష్టికి పరిస్థితిని తీసుకువెళ్లారు. మరి కూటమి ప్రభుత్వం స్పందించి ఆగిపోయిన నిర్మాణాలకు బిల్లులు చెల్లిస్తే ఆ గ్రామస్థుల సమస్యలు తీరే అవకాశాలు న్నాయి. వ్యవసాయ పొలాలకు సంబంధించి కూడా ఎరువులు తీసుకురా వాలన్నా పాత రహదారి సక్రమం గా లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా పోరుమామిళ్ల మండలానికి సంబంధించి రూ.12 కోట్లు నిధు లు మంజూరు చేసి ఏపీఆర్‌ఆర్‌పీ గ్రాంటు ద్వారా పనులు ప్రారంభించినా బిల్లులు అందకపోవడంతో అక్కడ పనులను నిలిపివేశారు. రూ.12 కోట్ల నిధులకు గాను రూ.8కోట్లు బిల్లులు అందాల్సి ఉంది. మం డలంలో చెన్నారెడ్డిపేట నుంచి పుల్లీడు వరకు రహదారి నిర్మాణం చేప ట్టారు. ఇందుకు సంబంధించి రూ.3.50 కోట్లుకు పైగా బిల్లులు అందాల్సి ఉంది. రామాయపల్లె - దమ్మనపల్లె మీదుగా రహదారి నిర్మాణం చేప ట్టారు., పనులు పూర్తయినా వాటికి పూర్తిస్తాయిలో బిల్లులు అందలేదని తెలిసింది. అంతేకాక రజాసాహెబ్‌పేట సమీపంలో రూ.2.74 కోట్ల వ్య యంతో 3.385 కి.మీ. తారురోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించారు. కానీ బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ రహదారి నిర్మాణం చేపట్టినా బీటీ దశలో బిల్లులు అందని కారణంగా ఆగిపోయింది.

డీఈ ఏమన్నారంటే: కాగా ఈ విషయమై పంచాయతీ రాజ్‌ శాఖ ీపీఐయూ డీఈ నరసింహారెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ముద్దంవారి పల్లె బ్రిడ్జికి సంబంధించి బిల్లులు రావాల్సి ఉందన్నారు. బిల్లులు వస్తే సంబంధిత కాంట్రాక్టర్లు వెంటనే ఆ నిర్మాణాలు పూర్తి చేస్తారన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 11:55 PM