ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా ఉపేక్షించం
ABN, Publish Date - May 12 , 2025 | 11:44 PM
ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా ఉపేక్షించేది లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథనాయుడు అన్నారు.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథనాయుడు
పుల్లంపేట, మే 12 (ఆంధ్రజ్యోతి) : ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా ఉపేక్షించేది లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథనాయుడు అన్నారు. సోమవారం అనంతంపల్లె సర్పంచ మరళీకృష్ణారెడ్డి స్వగృహంలో కస్తూరిని గజమాలతో సత్కరించారు. అనంతరం ఆయన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యా రు. ఈ స మావేశంలో నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలను ఆ యనకు ఏకరవు పెట్టారు. ఈ సందర్భంగా కస్తూరి మాట్లాడుతూ పలుచోట్ల కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నట్లు తెలుస్తోంది... పార్టీ కార్యకర్తల ప్రాణాలు పోకముందే మేల్కోండి అంటూ వేడుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త విశ్వేశ్వరనాయుడు, నారాయణరెడ్డి, ముమ్మినేని విజయకుమార్‌చౌదరి, జనార్దననాయుడు, పద్మాకర్‌రెడ్డి, రొంపిచర్ల మురళి, పండేటి రమణ, కె.సుబ్రమణ్యం, మాజీ సర్పంచలు పాల్గొన్నారు.
Updated Date - May 12 , 2025 | 11:44 PM