ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బ్రహ్మంగారిమఠాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

ABN, Publish Date - May 12 , 2025 | 11:44 PM

బ్రహ్మంగారిమఠం మండ లాన్ని ఆదర్శ మండలంగా తీర్చిది ద్దుతామని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేర్కొన్నా రు.

సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుట్టా

జూనలో మహా గురుకులాన్ని పునః ప్రారంభిస్తాం ఎమ్మెల్యే పుట్టా

బ్రహ్మంగారిమఠం, మే 12 (ఆంధ్ర జ్యోతి) : బ్రహ్మంగారిమఠం మండ లాన్ని ఆదర్శ మండలంగా తీర్చిది ద్దుతామని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేర్కొన్నా రు. సోమవారం బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠ శాల ఆవరణలో నూతనంగా ఇంట ర్మీడియట్‌ కళాశాల భవనాన్ని రూ.కోటి32 లక్షల వ్యయంతో నిర్మించ డానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రహ్మంగారిమఠం మండలంలో ప్రస్తుతానికి నవోదయ పాఠశాల నిర్మాణానికి 20 ఎకరాల భూమిని పరిశీలించామని, అలాగే గతంలో రూ.25 కోట్లతో మహా గురుకులాన్ని తోట్లపల్లె గ్రామంలో నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం చిన్న చిన్న మరమ్మతులు ఉండడంతో వాటిని కూడా ఇటీవల పరిశీలించి సంబంధిత కాంట్రాక్టరుకు పనులు చేయాలని తెలిపామన్నారు. 2025-26 విద్యాసంవత్సరానికి జూన మొదటి వారంలో విద్యార్థులు అడ్మిషన్లు చేయించి పాఠశా లను పునః ప్రారంభిస్తామని పేర్కొన్నారు. బ్రహ్మం గారిమఠం మండలంలో 700 ఎకరాలు ఉంటే 1500 ఎకరాలు ఆనలైనలో వివిధ వ్యక్తులపై చేయించుకున్నారన్నారు. ఆ విషయంపై జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లగా, కమిటీలను వేశామని, త్వరలోనే రికార్డులు పరిశీలించి అనర్హులను తొలగించి భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, యు వ నాయకుడు మల్లిఖార్జునరెడ్డి, శివాయాదవ్‌, సాంబశివారెడ్డి, మైదుకూరు యువత ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి, ఎస్‌ఆర్‌ శ్రీనివాసులరెడ్డి, పుట్ట ప్రభాకర్‌యాదవ్‌, ఉపాధ్యక్షు డు శీలం నరసింహగౌడ్‌, సర్పంచ నారాయణ, పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 11:44 PM