ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాజంపేట నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం

ABN, Publish Date - Jul 04 , 2025 | 10:56 PM

రాజంపేట నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగనమోహనరాజు పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ అధ్యక్షుడు జగనమోహనరాజు, సబ్‌కలెక్టర్‌ నిదియాదేవి

టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు చమర్తి

రాజంపేట, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : రాజంపేట నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగనమోహనరాజు పేర్కొన్నారు. శుక్రకవారం రాజంపేట సబ్‌కలెక్టర్‌ కార్యాలయ సబా భవనంలో సబ్‌కలెక్టర్‌ నిదియాదేవి అధ్యక్షతన జరిగిన రాజంపేట నియోజకవర్గ 2047 లక్ష్యానికి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నియోజకవర్గంలోని తహసిల్దారులు, ఎంపీడీవోలతో జరిగిన సమీక్ష సమావేశానికి చమర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేటను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడానికి తహశిల్దారులు ఎంపీడీవోలు, అన్నిశాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు.

సబ్‌కలెక్టర్‌ నిదియాదేవి మాట్లాడుతూ పేదరికంలేని సమాజం అన్న నినాదంతో పీ-4 విధానంతో ముందుకు సాగాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 10 సూత్రాలతో చేపట్టిన విజన 2047 లక్ష్యాలతో ముందుకు సాగడానికి అందరూ కలిసికట్టిగా కృషి చేయాలన్నారు. దీనివల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయన్నారు. కట్టావారిపల్లెలో...

రాజంపేట మండలం కట్టావారిపల్లెలో చమర్తి జగనమోహనరాజు ఆధ్వర్యంలో శుక్రవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. మాజీ మండల పరిషత అధ్యక్షుడు పారా సుబ్బానాయుడు, గన్నే సుబ్బనరసయ్యనాయుడు, కమ్మ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణచౌదరి, మాజీ మండల పార్టీ అద్యక్షులు బాపనయ్యనాయుడు, వెంకటేశ్వర్లునాయుడు తదితరులు పాల్గొన్నారు. మామిడి రైతుకు అండగా కూటమి ప్రభుత్వం

మామిడి రైతుకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని చమర్తి జగనమోహనరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన రాజంపేటలో విలేకరులతో మాట్లాడుతూ మామిడి రైతులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.

Updated Date - Jul 04 , 2025 | 10:56 PM